ఇవాళ మంచి ముహూర్తాలు...కేసీఆర్ సహా పలువురి నామినేషన్లు...

x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు వెంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం సమయంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తే...

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు వెంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం సమయంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తే మరోసారి రాజయోగం వస్తుందని పండితుల సూచించారు దీంతో ముహూర్త బలాన్ని ఎక్కువగా నమ్మే కేసీఆర్ నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఇవాళ అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు నామినేష్లు వేయనున్నారు.

టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు మకర లగ్నం. మధ్యాహ్నం 1.30 నుంచి 2.50 గంటల వరకు కుంభలగ్నం ఉంది. ఈ రెండు ముహూర్తాల్లో నామినేషన్ వేస్తే కేసీఆర్‌కు మరోసారి రాజయోగం వస్తుందని ఆయనకు పండితులు సూచించారు. ఈ మేరకు కేసీఆర్ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ముందుగా నామినేషన్ పత్రాలకు కూనాయిపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రత్యేక పూజలు చేసి అనంతరం గజ్వేల్ ఆర్డీవో ఆఫీసులో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇలా చేస్తే మొత్తం పార్టీ అభ్యర్థులకు శుభం కలుగుతుందని ఆయన నమ్ముతున్నారు.

ఇక కేసీఆర్‌తో పాటు గజ్వేల్‌లో కాంగ్రెస్ నేత వొంటేరు ప్రతాప్ రెడ్డి, సిద్దిపేటలో టీఆర్ఎస్ నేత హరీష్ రావ్, దుబ్బాకలో బీజేపీ అభ్యర్తి రఘునందన్ రావ్, సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి, పటాన్‌చెరులో టీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి, నర్సాపూర్‌లో కాంగ్రెస్ నేత సునితా లక్ష్మారెడ్డి, జహీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావ్, జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మాజీమంత్రి గీతారెడ్డి, మెదక్‌లో రెబల్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, నారాయణఖేడ్‌లో టీఆర్ఎస్ నేత భూపాల్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

మరోవైపు.. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ తనయుడు కేటీఆర్ మాత్రం ఈ నెల 19న నామినేషన్ వేయనున్నారు. మొత్తానికి సెంటిమెంట్ ను ఎక్కువగా నమ్మే కేసీఆర్‌కు ఈ ముహూర్త భలం ఎంతవరకూ యోగిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories