ఏపీలో పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్

ఏపీలో పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్
x
Highlights

ఏపీలో పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్. తాను ఏపీకి వెళ్లే విషయంలో ఏలాంటి అనుమానం లేదని వందకు వంద శాతం ఆంధ్రప్రదేశ్‌కు...

ఏపీలో పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్. తాను ఏపీకి వెళ్లే విషయంలో ఏలాంటి అనుమానం లేదని వందకు వంద శాతం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తానని చెప్పారు. ఏపీకి రావాలని అక్కడి నుంచి చాలామంది అడుగుతున్నారని తెలిపారు. మరోవైపు కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ కామెంట్స్‌కు చంద్రబాబు కౌంటరిచ్చారు.

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ఏపీలో తన ఎంట్రీపై కొనసాగుతున్న ఉహగానాలకు ఓ క్లారిటీ ఇచ్చేశారు. తాను ఏపీకి వెళ్లే విషయంలో ఎలాంటి డౌట్ లేదని చెప్పారు. ఏపీ రాజకీయాల్లో కలుగజేసుకుంటానని చెప్పిన మాటలను మరోసారి పునరుద్ఘాటించారు కేసీఆర్. పక్కాగా ఏపీకి వెళ్తానని స్పష్టం చేశారు. వంద శాతం ఏపీకి వెళ్తానన్నారు. ఏపీకి రావాలని అక్కడి నుంచి చాలామంది అడుగుతున్నారని కూడా కేసీఆర్ తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం, తమ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి అనేక సందేశాలను వచ్చాయని కేసీఆర్ తెలిపారు. తమను అక్కడికి రమ్మని పిలుస్తున్నారని చెప్పారు. అంతే కాకుండా ఈ ఎన్నికల్లో తనకు చంద్రబాబు గిఫ్ట్ ఇచ్చారని, త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. అయితే, ఒంగోలు పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ కామెంట్స్ పై స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు, రావొచ్చన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లానని అక్కడి సీఎం కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి, తనకేదో గిఫ్ట్‌ ఇస్తానంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించేందుకు ఎక్కడికైనా వెళ్లి రావొచ్చన్నారు. తాము తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి కోసం పని చేస్తామన్నారు.

మరోవైపు, ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్ కు శుభాకంక్షాలు చెబుతూ ఫ్లక్సీలు వెలిశాయి. తెలంగాణలో మరోసారి సీఎంగా పగ్గాలు చేపడుతన్న కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీలో ఫ్లెక్సీలు దర్శనమివ్వడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories