కోటి ఆశల పల్లకి... ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ

Submitted by santosh on Wed, 05/16/2018 - 11:07
kcr with employees union

ఎన్నిక‌లు దగ్గర‌ప‌డుతున్న వేళ ఉద్యోగుల‌ను ప్రస‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డింది... తెలంగాణ స‌ర్కారు. ఉద్యోగ‌, ఉపాద్యాయ‌, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై దృష్టిసారించింది. మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం నివేధికను అధ్యయనం చేసిన సీఎం కేసీఆర్... ఇవాళ ఉద్యోగ సంఘాలతో సమావేశం కాబోతున్నారు. టీఆర్ఎస్ స‌ర్కార్ ఎంప్లాయిస్ ఫ్రెండ్లీదని ప్రక‌టించుకున్న సీఎం కేసీఆర్..గతంలో ఉద్యోగులు అడిగిన దానికంటే ఎక్కవ ఫిట్‌మెంట్ ఇచ్చి తనవైపు తిప్పుకున్నారు. బంగారు తెలంగాణ‌ నిర్మాణానికి క‌లిసిరావాల‌న్న ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఉద్యోగులు కూడా ఆయనకు సహకరిస్తూ వచ్చారు. కానీ రాను రాను ప‌రిస్థితులు మారిపోయాయి. ప్రమోష‌న్లు, ట్రాన్స్‌ఫ‌ర్లు, సీపీఎస్ ర‌ద్దు, పీఆర్సీ వంటి వాటి స‌మ‌స్యల‌ు అప‌రిష్కృతంగానే ఉండిపోయాయి. దీంతో ఉద్యోగుల్లో అసహనం ఏర్పడింది. తెలంగాణ ఏర్పడి నాలుగేళ్లు పూర్తి అవుతున్నా సీఎం ఒక్క‌సారికూడా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌కపోవ‌టంతో అసంతృప్తి నెలకొంది. దీంతో పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు కేసీఆర్.

కేబినెట్ కమిటీ నివేదికపై సమగ్ర చర్చలు జరిపిన సీఎం...ఇవాళ ఉద్యోగ‌సంఘాల‌తో భేటీ కాబోతున్నారు. వారి మెజారిటీ డిమాండ్లు అంగీకరించే అవకాశం ఉన్న‌ట్లు తెల‌ుస్తోంది. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లు, హెల్త్ కార్డులు, ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు,ఏపీలోని ఉద్యోగులను తెలంగాణకు తీసుకువచ్చే అంశాలపై సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొద‌టి పీఆర్సీ వేసి ఉద్యోగుల‌ను సంతృప్తి ప‌రిచాలని యోచిస్తున్నట్లు స‌మాచారం.కానీ సీపీఎస్ ‌అంశం మాత్రం కేంద్రం మీదకు నెట్టేసి చేతులు దులుపునే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది

మరి సీఎంతో ఇవాళ జరిగే చర్చల్లో ఉద్యోగుల ఎన్ని డిమాండ్లు పరిష్కార మౌతాయి...? ప్రభుత్వ ప్రతిపాదనలకు ఉద్యోగ సంఘాలు అంగీకరిస్తాయా..? సమ్మె చేయాలనే ఉద్దేశంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు... సీఎం హితోపదేశంపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

English Title
kcr with employees union

MORE FROM AUTHOR

RELATED ARTICLES