శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ ఏకగ్రీవ ఎన్నిక

శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ ఏకగ్రీవ ఎన్నిక
x
Highlights

టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన 88 మంది శాసన సభ్యులు తెలంగాణ భవన్లో కేసీఆర్‌ను తమ నేతగా ఎన్నుకున్నారు....

టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన 88 మంది శాసన సభ్యులు తెలంగాణ భవన్లో కేసీఆర్‌ను తమ నేతగా ఎన్నుకున్నారు. తర్వాత టీఆర్‌ఎస్‌ఎల్పీ చేసిన తీర్మానాన్ని కేసీఆర్ స్వయంగా గవర్నర్ నరసింహన్‌కు సమర్పిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ను అనుమతి కోరతారు. రేపు మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ రేపు రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపడతారు. రేపు మధ్యాహ్నం ఒకటిన్నరకు కేసీఆర్ పదవీ ప్రమాణం చేస్తారు. కేసీఆర్ జాతక రీత్యా పండితులు ఈ ముహూర్తాన్ని ఖరారు చేశారు. కేసీఆర్‌తో పాటు ఐదుగురు మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా..అత్యంత నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం రాజ్ భవన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories