కర్ణాటకలోని తెలుగువారంతా ఆ పార్టీకే ఓటేయండి

Submitted by arun on Fri, 04/13/2018 - 15:50
kcr

కర్ణాటకలో ఉన్న తెలుగు ప్రజలందరూ జేడీఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఫెడరల్ ఫ‌్రంట్‌ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌ జేడీఎస్ దళపతి దేవేగౌడతో చర్చలు జరిపారు. కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామన్న కేసీఆర్‌ భారతమాతను, రైతులను రక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌, బీజేపీ పాలిస్తున్నాయని వీటికి ప్రత్యామ్నాయంగా గుణాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ పని చేస్తుందన్నారు. ఏడు దశాబ్దాలుగా కావేరి వివాదం కొనసాగుతూనే ఉందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. సిడబ్ల్యూసీ లెక్కల ప్రకారం 70వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయన్న కేసీఆర్‌ మిగులు జలాలను వాడుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. 

English Title
KCR Discuss about Third Front

MORE FROM AUTHOR

RELATED ARTICLES