ఇంతకీ కేసీఆర్‌ బెంగంతా దేనిపైన!!

Submitted by santosh on Thu, 05/10/2018 - 11:43
KCR CONCENTRATE ON NATIONAL POLITICS

తెలంగాణ సీఎం కేసీఆర్ తన మనసులో మాట చెప్పేశారు. ఇకపై తాను జాతీయ రాజకీయాలపై దృష్టి పెడతానని ప్రకటించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న తనను ఆశీర్వదించాలని మెదక్ జిల్లావాసులను కోరారు. రాష్ట్ర రాజకీయాల గురించి బెంగ లేదన్న కేసీఆర్..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 85 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ అధినేత ఇక రాష్ట్ర రాజకీయ పగ్గాలను పక్కనపెట్టి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. ఇది సొంత జిల్లా మెదక్ సాక్షిగా ఆయనే చెప్పిన మాట. దేశంలో గుణాత్మక మార్పు కోసం టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించినట్టు వివరించారు. 60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ తిరోగమనంలో నడిపించాయని కేసీఆర్ విమర్శించారు. దేశానికి సరైన దశ, దిశ చూపించడంలో అరెండు పార్టీలూ అట్టర్‌ ప్లాప్ అయ్యాయని విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా రైతులు, దళితులు, గిరిజనులు, మైనార్టీ, నిరుద్యోగ యువకుల్లో అసంతృప్తి గూడుకట్టుకుని ఉందని.. అన్ని వర్గాలకు మేలు జరిగేలా దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మెదక్‌ బిడ్డనైన తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు చెప్పారు. తాను విజయం సాధించేలా జిల్లా ప్రజలు ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్ర రాజకీయాల గురించి తనకు రంది లేదని సీఎం అన్నారు. అడ్డగోలు విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీని చూస్తే తనకు ఎలాంటి బెరుకూ లేదని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 85 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మెదక్‌ జిల్లాలోని పది అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌నే గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు.. దేశం మొత్తం బాగు పడాలని కేసీఆర్ అన్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముందని అన్నారు.

English Title
KCR CONCENTRATE ON NATIONAL POLITICS

MORE FROM AUTHOR

RELATED ARTICLES