కేసీఆర్ , వైఎస్సార్ పై బయోపిక్ లు..వారి పాత్రల్ని పోషిస్తున్న నటులెవరు..?

x
Highlights

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం కేసీఆర్...ఇద్దరూ రాజకీయ ఉద్దండులే. పొలిటికల్ లీడర్స్ గా...తెలుగు రాష్ట్రాలపై చేరగని ముద్ర వేశారు. కోట్లాది అభిమానులను...

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం కేసీఆర్...ఇద్దరూ రాజకీయ ఉద్దండులే. పొలిటికల్ లీడర్స్ గా...తెలుగు రాష్ట్రాలపై చేరగని ముద్ర వేశారు. కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పడీ రియల్ పొలిటీషియన్స్ జీవిత కథ ఆధారంగా సినిమాలు రానున్నాయి. కేసీఆర్ బయోపిక్ కోసం..బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్...స్టోరీ రచిస్తున్నాడు.

తెలంగాణ రాజకీయ చరిత్రలో, సీఎం కేసిఆర్ ది చెదిరిపోని హిస్టరీ. తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కీర్తి సంపాదించాడు. పొలిటికల్ లీడర్ గా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన కేసీఆర్ రాజకీయ జీవితాన్ని వెండితెరపై చూపించబోతున్నారు. దీనికి బాహబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించబోతున్నాడు.

కేసీఆర్ రాజకీయ ప్రయాణం నుంచి ఉద్యమంలో పోషించిన పాత్ర. ఆ తర్వాత జరిగిన సంఘటనలను కథా రూపంలో సినిమాగా అందించబోతున్నారు. డాక్యూమెంటరీలా కాకుండా కమర్షియల్ సినిమాగానే తెరకెక్కించనున్నారు. కథను రూపొందించే బాధ్యతను ఫేమస్ స్కిప్ట్ రైటర్ జయేంద్ర ప్రసాద్ కు అప్పగించారు. ఇ నివాస్ కేసీఆర్ బయోపిక్ ను డైరెక్ట చేయబోతున్నాడు. ఇటీవలే దర్శక నిర్మాతలు విజయేంద్రప్రసాద్‌ని కలిశారు. కథ గురించి, సినిమా గురించి డిస్కస్ చేశారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కేసీఆర్ గా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించనన్నట్టు ప్రచారం జరుగుతోంది. గులాల్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో కూడా సినిమా రూపొందుతోంది. జన హ్రుదయ నేతగా పేరు సంపాదించుకున్న వైఎస్ఆర్ రాజకీయ జీవితం నుంచి..సీఎంగా చేసిన సేవల వరకు సినిమాలో చూపించబోతున్నారు. అలాగే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన సంఘటనలను కూడా ప్రస్తావించనున్నారు. మహిరాఘవ్ దర్శకత్వం అందించబోతున్న ఈ సినిమాలో వైఎస్ ఆర్ గా మలయాల నటుడు మమ్ముట్టి నటించబోతున్నాడు. దీనికి యాత్ర అనే టైటిల్ ను కన్ఫామ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories