తెలంగాణ ముఖ్యమంత్రిగా నేడు కేసీఆర్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ ముఖ్యమంత్రిగా నేడు కేసీఆర్‌ ప్రమాణస్వీకారం
x
Highlights

గులాబీ బాస్‌ కేసీఆర్‌ నేడు రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంటా 25 నిమిషాలకు రాజ్‌భవన్‌‌లో...

గులాబీ బాస్‌ కేసీఆర్‌ నేడు రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంటా 25 నిమిషాలకు రాజ్‌భవన్‌‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, అతి సాధారణంగా ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌‌ నేడు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా, అతి సాధారణంగా ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటా 25 నిమిషాలకు రాజ్‌భవన్‌ వేదికగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే గవర్నర్‌కు టీఆర్‌ఎస్‌ సమాచారం అందజేయడంతో కేసీఆర్‌ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేయనుండగా, మంత్రివర్గ కూర్పుపై హాట్‌హాట్‌ చర్చ జరుగుతోంది. నలుగురు మంత్రులు ఓడిపోయినందున, వీరి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసుకోవడంతోపాటు ప్రస్తుతమున్న వారిలో కూడా కొందరిని మార్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories