బాబుపై మండిపడ్డ కత్తి మహేష్

Highlights

నిన్న పోలవరం నిర్మాణానికి సంబంధించి సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.. ప్రాజెక్టు పనులు ఆపాలంటూ.. కేంద్రం రాసిన లేఖపై. చంద్రబాబు సంచలన...

నిన్న పోలవరం నిర్మాణానికి సంబంధించి సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.. ప్రాజెక్టు పనులు ఆపాలంటూ.. కేంద్రం రాసిన లేఖపై. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం పనులను కేంద్రం ఆపమంటే.. ఆపేస్తానని చెప్పారు. టెండర్ల విషయంలో.. కేంద్రం అదే వైఖరితో ఉంటే.. ప్రాజెక్టు పనులు వాళ్లకే అప్పజెప్పి నమస్కారం పెడతానన్నారు. ప్రాజెక్టు పనులు ఆరు నెలలు ఆగితే.. మళ్లీ దారిపట్టించడం కష్టమని చంద్రబాబు అన్నారు. బీజేపీ మిత్రపక్షం కాబట్టే.. మరింత సహనంగా వ్యవహరిస్తున్నామని బాబు చెప్పారు. బీజేపీ నేతలను కూడా.. కేంద్రంతో మాట్లాడమని చెప్పినట్లు తెలిపారు. పోలవరం విషయంలో ఎందుకిన్ని ఇబ్బందులో.. తనకే అర్థం కావడం లేదన్నారు. కేంద్రం సహకరిస్తే ఓకే.. లేకపోతే మన కష్టం మిగులుతుందన్నారు.

ఇక దీనిపై ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ సోషల్ మీడియా లో స్పందించారు.. "మొత్తానికి ఇన్నిరోజులూ చెప్పింది అబద్ధాలన్నమాట" అంటూ సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా స్పందించారు.. అంతేకాదు చంద్రబాబుపై కొన్ని వ్యంగ్య చిత్రాలు పోస్ట్ చేస్తూ తన నిరసనని వ్యక్తం చేసారు.. గతంలో మహేష్ కత్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ కామెడీ షో యాక్టర్ హైపర్ ఆదిలపై విరుచుకుపడుతూ.. నిత్యం ఏదో ఒక రూపంలో తన భావాలను వ్యక్తపరుస్తున్నారు.. తాజాగా చంద్రబాబుపై ఈ విమర్శ చేయడాన్ని ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..

Show Full Article
Print Article
Next Story
More Stories