సో... మొత్తానికి జనసేన ముఖ్య ఉద్దేశం అదన్నమాట : కత్తి మహేష్

Submitted by admin on Tue, 12/12/2017 - 14:16

కత్తి మహేష్ పెద్దగా పరిచయం అక్కర్లేనిపేరు ఎ విషయాన్నైనా నిర్మొహమాటంగా అందులోని భావాన్ని వ్యక్తపరుస్తుంటారు.. గతంలో కేవలం సినిమాలపై మాత్రమే విమర్శలు చేసే అయన సడన్ గా రాజకీయాలపై బాణాలు ఎక్కుపెడుతున్నారు గతవారం పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలంటూ.. కేంద్రం రాసిన లేఖపై. చంద్రబాబు అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై నాలుగు రోజుల కిందట  కత్తి మహేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలను ఖండించారు.. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు  "మొత్తానికి ఇన్నిరోజులూ చెప్పింది అబద్ధాలన్నమాట" అంటూ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు అంతేకాదు చంద్రబాబుపై కొన్ని వ్యంగ్య చిత్రాలు పోస్ట్ చేస్తూ తన నిరసనని కూడా వ్యక్తం చేసారు.. 

ఇదిలావుంటే గతంలో రాజకీయాలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా విమర్శించిన కత్తి మహేష్ తాజాగా నిన్నటి పర్యటన విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు చేసారు ఆ విమర్శలు అయన మాటల్లోనే  "సో... మొత్తానికి జనసేన ముఖ్య ఉద్దేశం ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవిని మోసం చేసినవాళ్ళని చెప్పుతో కొట్టడం అన్నమాట! అది కాంగ్రెస్ తో కలిస్తేనే సాధ్యం అని చెప్పకనే చెప్పాడు. కక్ష సాధింపు ముఖ్యమైనప్పుడు లక్ష్య సాధన ఏముంటుంది?!? " అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ పై విరుచుకు పడ్డారు కత్తి మహేష్..

English Title
katthi-mahesh-comments-pawan-kalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES