పెళ్లిపై నోరు విప్పిన క‌త్రినా కైఫ్‌

Submitted by chandram on Thu, 12/06/2018 - 12:47
Katrina

బాలీవుడ్ తారాలు అందరూ ఇప్పుడు పెళ్లిళ్లా బాట పట్టారు. ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తన రూట్ సినిమావైపు కాకుండా పెళ్లి ముడ్‌లో పడిందని ముంబై మిర్రర్తో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కత్రినా వెల్లడించింది. ఇటివలే అనుష్క సోనమ్, దీపీక, ప్రియాంకా చోప్రాలు వివాహం చేసుకున్నా విషయం తెలిసిందే కాగా కత్రీనా కూడా తన పెళ్లి, పిల్లల విషయం పై తాజాగా స్పందించింది. గత కొన్నిరోజులుగా తన మదిలో ఈ విషయం తిరుగుతోందని అయితే నా వివాహ విషయం ఆ భగవంతుడికే వదిలేశాను అని చెప్పింది.జీవితంలో మ‌న‌కు ఏది రాసి ఉంటే అది జ‌రుగుతుంది. అందుకే శాంతంగా ఉండ‌గ‌లుగుతున్నాను అని చెప్పింది "ఇది నా మనస్సులో ఉంది కానీ అది పని చేయలేదు మరియు మీరు జీవితంలో మీ కోసం సెట్ చేయబడిన మార్గాన్ని అనుసరించాలని సూచించింది. కాగా కత్రీనా రణబీర్‌కపూర్‌తో ఐదేండ్లపాటు రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి. 2016లో వీరికి బ్రేక్ అప్ అయింది. ప్ర‌స్తుతం క‌త్రినా భార‌త్ అనే సినిమాలో స‌ల్మాన్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

English Title
Katrina Kaif opens up about marriage and kids

MORE FROM AUTHOR

RELATED ARTICLES