టచ్ చేసి చూడు అర్థపర్థంలేని యాక్షన్ డ్రామా: కత్తి

Submitted by arun on Fri, 02/02/2018 - 16:14
kathi

రెండేళ్ల గ్యాప్ త‌రువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామ‌హ‌రాజ త‌నకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రల‌తో అల‌రిస్తున్నాడు. అయితే విక్ర‌మ్ సిరికొండ డైర‌క్ష‌న్ లో ప‌వ‌ర్ ఫుల్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ట‌చ్ చేసి చూడు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. విక్రమ్ సిరికొండ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రవితేజ సరసన రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కత్తి మహేష్ ఈ సినిమాపై రివ్యూ ఇచ్చేశారు. సినిమా చాలా దారుణంగా ఉందంటూ మహేష్ రివ్యూలో పేర్కొన్నారు.
 
‘‘టచ్ చేసి చూడు అర్థపర్థంలేని యాక్షన్ డ్రామా. సెన్స్‌లెస్ స్టోరీ. ఎయిమ్ లెస్ సీన్స్. రవితేజ టైమ్ వేస్ట్ చేసుకున్నారు. టచ్ చెయ్యకపోతేనే బెటర్.’’ అంటూ మహేష్ రివ్యూలో పేర్కొన్నారు. ఈ సినిమాలో రవితేజ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. అంతకు ముందొచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలా ఈ సినిమా కూడా తనకు మంచి సక్సెస్‌ను అందిస్తుందని రవితేజ భావించారు. కానీ కత్తి మహేష్ రివ్యూ దీనికి భిన్నంగా ఉండటం విశేషం.

English Title
kathi mahesh tweet about touch chesi chudu

MORE FROM AUTHOR

RELATED ARTICLES