బావా ..బామ‌ర్ది అంటూ ప‌వ‌న్ - జేపీపై క‌త్తి దూసిన క‌త్తి

Submitted by lakshman on Sat, 03/31/2018 - 08:45
Kathi Mahesh Sensational Comments on Pawan Kalyan and jaya prakash narayana

క్రిటిక్ క‌త్తిమ‌హేష్ మ‌రోసారి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై క‌త్తిదూశారు. ఈసారి ప‌వ‌న్ తో పాటు లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ పేరు కూడా ప్ర‌స్తావించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ - జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ ల సార‌ధ్యంలో కేంద్రం ఏపికి ఎన్ని నిధులు కేటాయించింది. అనే విష‌యం తెలుసుకునేందుకు జేఎఫ్ సీ అనే క‌మిటీని ఏర్పాటు చేశారు. ఆ క‌మిటీ ప్రారంభంలో కేంద్రంలో, రాష్ట్రంలో క‌ద‌లిక‌లు తెచ్చింది. ఇక ఏపీకి ప్ర‌త్యేక‌హోదా వ‌స్తుంది అని అంద‌రూ అనుకున్నారు. కానీ ఉన్న‌ట్లుండి జ‌యప్ర‌కాష్ నారాయ‌ణ ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నం గా మారింది.

జేఎఫ్ సీ ఏర్పాటు చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్తలో బాగున్నా..ఇప్పుడు దాని గురించి మాట్లాడ‌డంలేద‌ని మండిప‌డ్డారు. అందుకే తాను స్వ‌యంగా ఓ క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు సూచించారు. ఇదిలా ఉంటే ప‌వ‌న్ ఎప్పుడు దొరుకుతాడా..? ఏకి పారేద్దామా అని ఎదురు చూసే క‌త్తిమ‌హేష్ కు జ‌యప్ర‌కాష్ నారాయ‌ణ రూపంలో అస్త్రం దొరికినట్లైంది . దీంతో క‌త్తిమ‌హేష్ మ‌రింత రెచ్చిపోయారు.  ఈ సారి పవన్‌పై జేపీ చేసిన వ్యాఖ్యల్ని ఉదహరిస్తూ.. తన బావమరిదికి సమాధానం చెబుతున్నట్లుగా చెబుతూనే పవన్ వ్యక్తిత్వంపై విమర్శలు గుప్పించారు. 

""బావా! జేపీ గారు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ JFC మీద శ్రద్ధ చూపడం లేదు. అంటాడేమిటి?" బామ్మర్ది...పవన్ కళ్యాణ్ కి దేని మీదా పర్మనెంటుగా శ్రద్ధ ఉండదని. స్టార్ట్ చేసింది, ఫినిష్ చేసే సత్తా అస్సలు ఉండదని. అనుభవమైతేగాని ఆయనకు తెలిసిరాలేదు. అంతే.""
 ""ఒక ఊరిలో ఒక వెధవ.బ్రతికుండగా,ఆడోళ్ళని నానా హింసాలూ పెట్టేవాడు.చచ్చేముందు కొడుకుతో,బ్రతకడం ఇట్టా బతికేసాను.చచ్చాకైనా నాకు మంచిపేరు తీసుకురా అన్నాడట. కొడుకు తండ్రికన్నా దారుణాలు చేసి, "వీడికన్నా వీడి తండ్రే బెటర్ అనిపించాడంట. ఇప్పుడు చిరంజీవిని చూస్తే, బెటర్ అనిపించదూ మరీ!!!""

 " బావా! జనసేన అంబేద్కర్ భావజాలంతో ఏర్పడింది అని వాళ్ళ కొత్త నాయకుడు తమ్మిరెడ్డి శివశంకర్ రావు అంటున్నారు. ఇదేదో కొత్తగా లేదూ!" కొత్తగానే ఉంది బామ్మర్ది! అధికార కులమైన కాపులకు రిజర్వేషన్లు కావాలి. దళితులకు రిజర్వేషన్లు తీసేయాలి. అనేది ఏతరహా అంబేద్కర్ సిద్దాంతామో నాకైతే తెలీదు. అంటూ ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు చేశారు క‌త్తిమ‌హేష్ . ""

English Title
Kathi Mahesh Sensational Comments on Pawan Kalyan and jaya prakash narayana

MORE FROM AUTHOR

RELATED ARTICLES