‘కృష్ణార్జున యుద్ధం’పై కత్తి రివ్యూ

Submitted by arun on Thu, 04/12/2018 - 15:58
kathi

హీరోలకు ఒక్క హిట్ పడితేనే ఉబ్బితబ్బిబవుతారు. ఆనందానికి అవదులే లేనట్టు గాల్లో తేలిపోతుంటారు. అలాంటిది నాచురల్ స్టార్ నాని..ఒకటి కాదు ,రెండు కాదు ఏకంగా ఎనిమిది హిట్లు కొట్టాడు. అవి కూడా బ్యాక్ టు బ్యాక్. ప్రజెంట్ మరే హీరోకు లేని ఘనతను సాధించిన నాని తొమ్మిదో హిట్ కు సందడి మొదలెట్టాడు. హిట్ అనే పదానికి కేరాఫ్ గా మారిపోయాడు నాచురల్ స్టార్ నాని. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మొదలైన నాని జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. వైవిధ్యమైన స్టోరీలతో ప్రజెంట్ టాలీవుడ్ లో మరే హీరోకు లేని సక్సెస్ రేటును కంటీన్యూ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది విజయాలను ఖాతాలో వేసుకున్న నాని, తొమ్మిదో హిట్ కు రెడీ అయ్యాడు. కృష్ణార్జునయుద్ధం సినిమాతో రణరంగలోకి దిగాడు. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో నానికి జంటగా అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ నటించారు. ఇంతకు ముందు రెండు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసినప్పటికీ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలను నాని అందుకోగలిగాడా? లేదా అంటే.. కత్తి మహేష్ మాత్రం అందుకోగలిగాడనే చెప్తున్నారు.

కృష్ణార్జున యుద్ధంపై కత్తి రివ్యూ ఇచ్చారు.‘‘కృష్ణార్జున యుద్ధం సినిమా చాలా మంచి స్టోరీ.. అలాగే చాలా మంచి రిజల్ట్ ఇచ్చే సినిమా. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఆయన నటన అద్భుతంగా ఉంది. కార్తీక్ ఘట్టమనేని అందించిన ఫోటోగ్రఫీ, తమీజా సంగీతం ఈ చిత్రానికి అదనపు అట్రాక్షన్. కొన్ని అనవసర పాటలు, విసుగు పుట్టించే లెంగ్తీ సీన్స్ తప్ప ఈ సినిమా చాలా బాగుంది. ఇది చాలా డీసెంట్ మూవీ’’ అని కత్తి రివ్యూలో పేర్కొన్నారు.

English Title
Kathi Mahesh Review On krishnarjuna yuddham

MORE FROM AUTHOR

RELATED ARTICLES