‘ఛలో’పై క‌త్తిమ‌హేష్ రివ్యూ

‘ఛలో’పై క‌త్తిమ‌హేష్ రివ్యూ
x
Highlights

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య. ఆ తర్వాత ‘కల్యాణ వైభోగమే’, ‘ఒక మనసు’, ‘జ్యో అచ్యుతానంద’, ‘కథలో...

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు నాగశౌర్య. ఆ తర్వాత ‘కల్యాణ వైభోగమే’, ‘ఒక మనసు’, ‘జ్యో అచ్యుతానంద’, ‘కథలో రాజకుమారి’ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నారు. మధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనా, విభిన్న కథలనే ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దాదాపు ఏడాది విరామం తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య నటించిన చిత్రం ‘ఛలో’. నాగశౌర్య, రష్మిక మండన్న నటించిన ఛలో సినిమా నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై ఈ సినిమా రూపొందింది. నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందింది. ఫస్ట్ షోతోనే మంచి టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాపై కత్తి మహేష్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఛలో సినిమా డీసెంట్ రొమాన్స్ - కామెడీ కలబోతతో చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రేకెత్తించేలా ఉంది. అందమైన లవ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్‌లో సత్య కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్‌లో కొంత అసభ్యకరమైన కామెడీతో డౌన్ అయింది. నాగశౌర్య, రష్మిక రోల్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, వెన్నెల కిషోర్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచారు.’’ అని కత్తి మహేష్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories