బిగ్ బాస్ 2 పై కత్తి కార్తీక సంచలన వ్యాఖ్యలు!

Submitted by arun on Wed, 06/13/2018 - 17:53
kathi

టాలీవుడ్ హీరో, నేచురల్ స్టార్ నాని ప్రధాన వ్యాఖ్యాతగా 'బిగ్‌ బాస్-2' రియాల్టీ షో గత ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఈ రెండో సీజన్ షోపై పలువురు పలు రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్-1లో ఓ కంటెస్టెంట్‌గా ఉన్న కత్తి కార్తీక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్-2 రియాల్టీ షో గురించి 'ఇంకొంచెం మసాలా' అని చెప్పారని... మసాలా ఉందేమో కానీ, ఫ్లేవర్ మాత్రం మిస్ అయిందని కత్తి కార్తీక సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్-1లో కంటెస్టెంట్ అయిన కార్తీక తన తెలంగాణ యాసలో  యాంకర్ గా జనాలను అలరించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన ఒక్క కంటెస్టెంట్ ను అయినా పెట్టి ఉంటే బాగుండేదని చెప్పింది. సీజన్-1లో ముగ్గురు తెలంగాణ వాళ్లను పెట్టారని... ఈ సీజన్ లో కూడా అది కొనసాగి ఉంటే బాగుండేదని తెలిపింది. ఈ విషయంలో తాను కొంచెం నిరాశకు గురయ్యానని చెప్పింది.  ఒకప్పుడు తాను యాంకర్ గా ఉన్న సమయంలో కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలుసునని..కానీ బిగ్ బాస్ పుణ్యమా అని ఇరు రాష్ట్ర ప్రజలు తనను బాగా గుర్తించారని చెప్పింది.  

English Title
kathi karthika comments on bigg boss-2

MORE FROM AUTHOR

RELATED ARTICLES