స‌ర్వ పాప‌హ‌ర‌ణం కాశీ సంద‌ర్శ‌నం

స‌ర్వ పాప‌హ‌ర‌ణం కాశీ సంద‌ర్శ‌నం
x
Highlights

భారతదేశపు అత్యంత పవిత్రమైన గంగా నదీ తూర్పు పరివాహక ప్రాంతంలో కొలువుదీరి ప్రపంచంలోనే అతిపురాతనౖమెన నగరంగా పేరొందిన వారణాసి భారతదేశపు సాంస్కృతిక...

భారతదేశపు అత్యంత పవిత్రమైన గంగా నదీ తూర్పు పరివాహక ప్రాంతంలో కొలువుదీరి ప్రపంచంలోనే అతిపురాతనౖమెన నగరంగా పేరొందిన వారణాసి భారతదేశపు సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతోంది. వారణాసి నగరం నడిబొడ్డులో నెలకొన్న కాశీ విశ్వనాథ దేవాలయం శైవ జ్యోతిర్లింగాలలో ఒకటిగా భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కాశీ విశ్వేశ్వర దేవాలయం సంప్రాప్తించుకుంది.

కాశీ దేవాలయం
గంగానదికి సమీపంలో విశ్వనాథ గల్లీగా పిలవబడే చిన్న వీధిలో చిన్న చిన్న దేవాలయాల సమూహంగా దేవాలయ ప్రాంగణం వర్థిల్లుతోంది. ప్రాంగణంలోని విశ్వనాథ దేవాలయం చుట్టు పక్కల అనేక అనుబంధితౖమెన పీఠాలు ఆవరించి ఉన్నాయి. 'జ్ఞాన వాపి' అనగా జ్ఞాన బావిగా పేరొందిన నుయ్యి ఒకటి ప్రధాన దేవాలయానికి ఉత్తర దిశలో నెలకొంది. విశ్వనాథ దేవాలయం మంటపం మరియు గర్భగుడితో అలరారుతోంది. గర్భగుడిలో ప్రధానంగా పూజలందుకునే శివస్వరూపానికి తార్కాణంగా నిలుస్తున్న లింగం 60 సెం.మీ.ల పొడవు మరియు 90 సెం.మీ.ల చుట్టుకొలతతో వెండి తాపడాన్ని కలిగి ఉంటుంది. శివలింగం నల్లరాతితో నిర్మితౖమెంది. దేవాలయ అంతర్భాగం విశాలంగా లేకున్నప్పటికీ ప్రశాంతౖమెన వాతావరణాన్ని కలిగి మహాశివుని పూజించుకునేందుకు భక్తులకు అనువుగా ఉంటోంది.

కాశీ విశ్వనాధ మందిరం వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురౖంపెన పూసిన బంగారు పూత కారణంగా దీనిని బంగారు మందిరం అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్‌ రాణి అహల్యాబాయి హోల్కర్‌ కట్టింపించింది. ఇందులో లింగాకారంగా కొలుౖవె ఉన్న దేవుడు విశ్వేశ్వరుడు, విశ్వనాధుడు పేర్లతో పూజలందు కొంటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఆలయ సమీపంలో ఉన్న గ్యాంవాపీ మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1839 లో పంజాబ్‌ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్‌ సింగ్‌ ఈజీ ఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పిం చాడు. 1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదే శ్‌ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్ప టి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్‌ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది.17 మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందరిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది.

స్త్రీ పురుషులు, పిల్లలు వృద్ధులు అనే తారతమ్యాలుకు చోటు లేకుండా, కులమతాలకు అతీతంగా ఎవౖరెనా కావచ్చు వారాణాశిని సందర్శించి గంగా నదిలో స్నానం చేసినట్లయితే మోక్షాన్ని పొందుతారని హిందూ పురాణేతిహాసాలు పేర్కొంటు న్నాయి. కనుకనే జీవితకాలంలో ఒక్కసాౖరెనా కాశీని సందర్శించాలనేది హిందువుల జీవితేచ్చ.

ధార్మిక ప్రాధాన్యత
భూగోళం అవతరించిన సమయంలో తొలి కాంతి కిరణం కాశీౖపె పడింది. అప్పటి నుంచి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అంశాల నెలవుగా పుణ్య క్షేత్రౖమెన కాశీ పేరుగాంచింది. పురాణాలను అనుసరించి అనేక సంవత్సారాలు ప్రవాసంలో గడిపిన పరమశివుడు వారాణాసికి విచ్చేసి తన నివాసంగా మార్చుకున్నాడని ప్రతీతి. పది అశ్వాలతో కూడిన రథాన్ని దశాశ్వమేథ ఘాట్కు పంపడం ద్వారా బ్రహ్మదేవుడు బోళాశంకరునికి స్వాగతం పలికాడు.

చరిత్ర
చరిత్ర పుట్టకముందు కాలం నుంచి దేవాలయం ఉన్నట్లుగా చెప్పబడింది. దేవాలయం ప్రాంగణంలోని భవన సముదాయాన్ని పునరుద్ధరించే నిమిత్తం 1776 సంవత్సరంలో అప్పటి ఇండోర్‌ సంస్థానపు మహారాణి అహల్యాబాయి భారీగా విరాళాలను అందించారు. దేవాలయ ఊర్థ్వభాగంలో 16 మీటర్ల ఎత్తయిన‌ కలశ గోపురాన్ని నిర్మించేందుకు లాహోర్‌ మహారాజు రంజిత్‌ సింగ్‌ 1000 కేజీల స్వర్ణాన్ని విరాళంగా ఇచ్చారని చెప్పబడింది. 1983 సంవత్సరంలో దేవాలయ నిర్వహణ బాధ్యతలను చేపట్టిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బెనారస్‌ పూర్వ పాలకుడు విభూతి సింగ్‌ను దేవాలయ ధర్మకర్తగా నియమించింది.

పూజకు వేళాయెనే...
ప్రతి రోజు తెల్లవారుఝామున గం 02.30 ని.లకు దేవాలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. ఉదయం మూడు నుంచి నాలుగు గంటల మధ్యకాలంలో జరిగే మంగళహారతికి టిక్కెట్లు కలిగిన భక్తులను అనుమతిస్తారు. అనంతరం ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు సాధారణ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మధ్యాహ్నం 11.30 నుంచి 12 గంటల మధ్య కాలంలో మధ్యాహ్న భోగ్‌ హారతిని ఇస్తారు. మరల మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు భక్తులు ఉచితంగా దర్శనం చేసుకోవచ్చు.సాయంత్రం ఏడు నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాయంకాలపు సప్త రుషి హారతిని ఇస్తారు. తర్వాత రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు. వెంటనే శృంగార్‌ లేదా భోగ్‌ హారతి ప్రారంభమవుతుంది. తొమ్మిది గంటల తర్వాత వెలుపలి నుంచి దర్శనం చేసుకునే అవకాశం మాత్రమే భక్తులకు లభిస్తుంది. రాత్రి గం. 10.30 ని.లకు శయన హారతి ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటలకు దేవాలయ ద్వారాలను మూసివేస్తారు. ప్రసాదంలో అత్యధికంగా చోటు చేసుకునే పాలు, వస్త్రాలు మరియు ఇతర నైవేద్యాలు పేదవారికి అందిస్తారు.

చేరుకునే మార్గం
విమానం ద్వారా:
దేశంలోని ప్రధాన నగరాలు, పర్యాటక ప్రాంతాలకు వారణాసి చక్కగా అనుసంధానౖమెంది. వారాణాసి నుంచి దేశంలోని అనేక నగరాలకు ప్రతి రోజు దేశీయ విమాన సేవలు లభిస్తున్నాయి. ఢిల్లీ-ఆగ్రా-ఖజ రహో-వారణాసి రోజువారీ విమాన సేవలు పర్యాటకులలో బహుళ ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి.

రైలు ద్వారా : ఉత్తర భారత భూభాగంలోని కీలక ప్రాంతంలో వారణాసి కొలుౖవె ఉండటంతో ఈ నగరం ఢిల్లీ, కోల్కతా, ముౖంబె మరియు దేశంలోని ఇతర ప్రాంతాలతో చక్కగా అనుసంధానౖమెంది. కాశీ జంక్షన్‌, వారాణాసి జంక్షన్‌ (వారణాసి కంటోన్మెంట్‌గా ప్రసిద్ధి) పేరిట రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అంతేకాక ఢిల్లీ లేదా క‌ల‌క‌త్తా నుంచి బయలుదేరే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు వారణాసి మీదుగా ప్రయాణిస్తుంటుంది.

రోడ్డు ద్వారా: సమతలౖమెన గంగా పీఠభూమి ప్రాంతాల్లో నెలకొనడంతో వారాణాసికి మంచి రహదారుల నెట్వర్క్‌ కలదు. ఉత్తర ప్రదేశ్లోని ప్రధాన పట్టణాల నుంచి ఇక్కడకు తరుచుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ బస్సులు ప్రజలను చేరవేస్తుంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories