కరుణానిధి చనిపోయినట్లు రెండో భార్యకు తెలియదు!

Submitted by arun on Thu, 08/09/2018 - 10:21
dayalu ammal karunanidhi

తన భాగస్వామి తిరుగురాని లోకాలకు చేరుకున్న విషయం, ఆ జీవనసహచరికి తెలియదు. కళ్లముందే భర్త ఆఖరి మజిలీ మొదలవుతున్నా.. ఏమాత్రం గుర్తించలేని స్థితి ఆమెది. డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూత, తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆయన రెండవ భార్య దయాళు అమ్మాళ్‌కు తెలియదు. 2016 నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కళ్ల ముందు ఏం జరుగుతుందో గ్రహించలేని స్థితిలో ఉన్న ఆమెకు, జ్ఞాపకశక్తి కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. కరుణ ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో.. మూడు రోజుల క్రితం పెద్ద కుమారుడు అళగిరి ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చి కరుణ వద్ద కొంతసేపు వుంచి ఇంటికి తీసుకెళ్లారు. మంగళవారం సాయంత్రం గోపాలపురంలోని ఇంటికి కరుణ పార్థివదేహాన్ని తీసుకొచ్చినప్పుడు ఆమె ఇంట్లోనే ఉన్నప్పటికీ.. ఏం జరిగిందో గ్రహించే స్థితిలో లేరు. అందుకే.. మెరీనాబీచ్‌లో జరిగిన కరుణ అంత్యక్రియలకు దయాళు అమ్మాళ్‌ను తీసుకురాలేదు.

English Title
Karunanidhi's Wife Dayalu Ammal Visits Him At The Hospital

MORE FROM AUTHOR

RELATED ARTICLES