ఇదీ కరుణానిధి... చక్రాల కుర్చీ కథ

Submitted by arun on Wed, 08/08/2018 - 16:28
karuna

డీఎంకె చీఫ్ కరుణానిధికి నల్ల కళ్లజోళ్లతో ఎలా విడదీయరాని బంధం ఉందో.... చక్రాల కుర్చీతో కూడ అంతే బంధం ఉంది. ఆసుపత్రిలో చేరాల్సి వస్తోందని భావించి వెన్నునొప్పిని నిర్లక్ష్యం చేయడంతో  కరుణానిధి చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.చక్రాల కుర్చీకే పరిమితమైన  ఆసుపత్రి నుండే ఆయన పాలనను సాగించారు. 2008 డిసెంబరు నుంచి కరుణానిధికి వెన్నునొప్పి ఇబ్బంది పెట్టింది. అయితే ఆస్పత్రికి వెళ్తే అడ్మిట్‌ చేస్తారనే అభిప్రాయంతో ఎవరితోనూ చెప్పకుండా దానిని భరిస్తూనే వచ్చారు. బాధ మరింత ఎక్కువ కావడంతో కుటుంబ వైద్యుడు గోపాల్‌కు చెప్పడంతో ఆయన ఆర్థో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ మయిల్‌వాగనన్‌ను ఇంటికి రప్పించారు. కరుణకు ఆయన తాత్కాలిక ఉపశమనం కలిగించే చికిత్సలు చేసి మందులు రాసిచ్చారు. అప్పట్లో చెన్నై నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టంలో 2009 జనవరి 25న జరిగిన ఓ కార్యక్రమంలో తన వెన్నునొప్పిని మరచి సుమారు 10 గంటలపాటు కరుణ కూర్చొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్న తర్వాత తీవ్రమైన బాధతో అల్లాడిపోయారు. ఆ రోజు అర్ధరాత్రికి కూడా బాధ తగ్గకపోవడంతో డాక్టర్‌ మయిల్‌వాగనన్‌ సూచనల మేరకు రామచంద్ర ఆస్పత్రి వైద్యనిపుణుడు డాక్టర్‌ ఎస్‌.ఎస్‌.కె.మార్తాండాన్ని రాత్రి ఒంటి గంటకు ఇంటికి రప్పించారు.

మార్తాండం కరుణకు చికిత్స చేశారు. అంతేకాదు  ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. ఈ సూచన మేరకు రాత్రి 2 గంటలకు రామచంద్ర ఆసుపత్రిలో చేర్చారు. వయోభారంతో పాటు శరీర బరువు కారణంగా వెన్నుపూసల్లో అరుగుదల ఏర్పడిందని వైద్యులు గుర్తించారు. మందులు, ఇంజక్షన్లతో చికిత్స చేసినా ఫలితం కన్పించలేదు.  దీంతో వెన్నెముకకకు కరుణానిధికి శస్త్రచికిత్స చేశారు. దీంతో అప్పటి నుండి ఆయన చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి వచ్చింది.
 

English Title
karunanidhi wheelchair

MORE FROM AUTHOR

RELATED ARTICLES