కరుణానిధి సొంత జిల్లా.. ప్రకాశం జిల్లా

Submitted by nanireddy on Tue, 08/07/2018 - 19:35
karunanidhi-own-distric

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతిచెందారన్న వార్త  తెలియడంతో  రాష్ట్రం ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగిపోయింది. జూన్ 3, 1924 న అప్పటి అవిభక్త తంజావూర్ జిల్లాలోని తిరుకువళైలోని ఓ నాదస్వర విద్వాంసుల కుటుంబంలో కరుణానిధి జన్మించారు. తండ్రి పేరు ముత్తు వేలన్, తల్లిపేరు అంజుగమ్మ. తమిళ నాయీబ్రాహ్మణ కులానికి చెందిన కరుణానిధి అసలు పేరు దక్షిణా మూర్తి. కరుణానిధి పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా.  8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న కరుణకు.. సాహిత్యమంటే ప్రాణం. ఉద్యమాలంటే మరీ ఇష్టం. మూఢ విశ్వాసాలకు పూర్తి వ్యతిరేకి. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు రకరకాల నాటికలు వేసేవారు. 14 ఏళ్ల వయసులోనే హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ద్రావిడోద్యమంలో భాగంగా హేతువాదులైన ద్రావిడ నాయకులు మతపరమైన పేర్లను త్యజించిన తరుణంలో ఆయన సొంత పేరును కరుణానిధిగా మార్చుకున్నారు.

ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో 13 సార్లు పోటీచేసిన కరుణానిధి ఓటమి ఎరుగని రాజకీయ నేతగా రికార్డు నెలకొల్పారు. తమిళనాడు ప్రజలు కరుణానిధిని ఆప్యాయంగా కలైజ్ఞర్ అని పిలుచుకుంటారు. దేశానికీ స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్లలో1949లో పెరియార్‌తో విభేదించిన ఆయన శిష్యుడు అన్నాదురై.. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)ను స్థాపించారు. పార్టీ రాజ్యాంగ రూపకల్పనలో కరుణానిధి ముఖ్య పాత్ర పోషించారు.ఆ సమయంలో డీఎంకే పార్టీ కోశాధికారిగా ఉన్నారు. పార్టీలో కీలక బాధ్యతలు చూడటం తోపాటు అన్నాదురైకు వ్యక్తిగతంగా దగ్గరయ్యారు.1969 అన్నాదురై మరణం.. ఆ పార్టీకి తీరని లోటయింది. తప్పని పరిస్థితుల్లో కరుణానిధి డీఎంకే పార్టీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.ఈ పరిణామం ఎంజీఆర్, వైగో లకు రుచించలేదు. దీంతో ఇద్దరు వేరు వేరు పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. 90 ఏళ్ళు పైబడిన కరుణ పేరుకు పార్టీ అధ్యక్షుడైనా.. వ్యవహారం నడిపేదంతా ఆయన ఇద్దరు కుమారులే, చిన్నకొడుకు ఎంకే స్టాలిన్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆపార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండగా, పెద్దకొడుకు అళగిరి డీఎంకే కు ఆయువుపట్టు అయిన మధురై సెగ్మెంట్ రాజకీయాలు చూస్తున్నారు. తమిళనాడుకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణ.. దేశ రాజకీయాలను సైతం శాసించారు. తన సారధ్యంలోని తమిళ ఎంపీలు ఏది చెబితే అది పార్లమెంట్లులో జరిగేలా కరుణ వ్యవహరించారు. మొత్తంగా ఈ 94 ఏళ్ల రాజకీయ కురువృద్ధుడు శకం నేడు(మంగళవారం) ముగిసింది.  

English Title
karunanidhi-own-distric

MORE FROM AUTHOR

RELATED ARTICLES