కరుణానిధి అంత్యక్రియలు పూర్తి

Submitted by arun on Wed, 08/08/2018 - 19:01
karunanidhi

కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో అన్నా మెమోరియల్ హాల్‌ ముగిశాయ్‌. ఆశ్రునయనాల మధ్య ద్రవిడ ఉద్యమ నేతకు కన్నీటితో వీడ్కోలు పలికారు. ప్రభుత్వలాంఛనాలతో కరుణానిధి అంత్యక్రియలు జరిగాయ్. చివరిసారి కరుణ భౌతిక కాయాన్ని చూసి స్టాలిన్‌, అళగిరి, కనిమొళి, ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మెరీనా బీచ్‌‌లోని జరిగిన అంత్యక్రియలకు పలువురు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి రాజకీయ నేతలు హాజరయ్యారు. 

మరోవైపు రాజాజీహాల్‌ నుంచి కరుణానిధి అంతిమయాత్ర 4గంటలకు ప్రారంభమైంది. కరుణను చివరి సారి చూసేందుకు రోడ్డు పొడవున జనం బారులు తీరారు. చివరి జననేత చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. వాలాజా రోడ్, చెపాక్‌ స్టేడియం నుంచి అంతిమయాత్ర కొనసాగింది. దాదాపు రెండుగంటల పాటు కరుణ అంతిమయాత్ర జరిగింది. డీఎంకే నేతలు, కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

తాను చనిపోయాక తన శవపేటికపై ఏం రాయాలన్న విషయం కూడా 33 ఏళ్ల క్రితమే స్టాలిన్‌కు చెప్పారు కరుణానిధి. చివరి క్షణం వరకు విశ్రాంతి లేకుండా పనిచేశారని సమాధిని చూసి ప్రజలు అనుకోవాలని స్టాలిన్‌తో కరుణ చెప్పారు. ఇప్పుడు ఆ మాటలనే కరుణానిధి శవపేటికపై స్టాలిన్ రాయించారు. మరోవైపు డీఎంకేకు సంబంధించిన జెండాలో బ్లాక్, రెడ్ కలర్ ఉంది. మూఢనమ్మకాలకు దూరంగా ఉండడానికి బ్లాక్ సూచిస్తుందని, రెడ్ కలర్ విప్లవానికి అద్దం పడుతుందని నేతలు తెలిపారు. 

English Title
karunanidhi last rights has completed

MORE FROM AUTHOR

RELATED ARTICLES