పద్మావత్ సినిమాపై కర్ణిసేన సంబరాలు

Submitted by arun on Sat, 02/03/2018 - 11:48

పద్మావత్ సినిమాపై నానా రచ్చ చేసిన కర్ణిసేన సంబరాలు చేసుకుంది..? ఇంతకాలం పద్మావత్‌ను నిషేధించాలంటూ విధ్వంసానికి దిగిన రాజ్‌పుత్‌లు...ఆంనందడోలికల్లో మునిగి పోయారు. ఇంతకీ వారి సంతోషం ఎందుకు..? పైగా పద్మావత్ భారీ విజయం సాధించిన తర్వాత కూడా వారు ఆందనందంతో డాన్సులేయడానికి కారణమేంటి..?

పద్మావత్ ఫ్లాప్ అయ్యుంటే కర్ణిసేన డాన్సులకు కారణం ఉందనుకోవచ్చు. కానీ పద్మావత్ ఘన విజయం సాధించింది. వంద కోట్ల క్లబ్‌లో చేరింది. అయినా కర్ణిసేన కార్యకర్తలు టపాసులు కాల్చారు...డాన్సులు వేశారు. ఎందుకు..? వారి ఆనందానికి కారణమేంటి..?

నిజానికి కర్ణిసేన డాన్సులకు పద్మావత్ సినిమాకు సంబంధం లేదు. రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాలే వీరి ఆనందోత్సాహాలకు కారణం. 2 ఎంపీ స్థానాలకు, ఓ అసంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అందుకే వారు గెంతులేశారు కేరింతలు కొట్టారు. తాము ఎంతకోరినా మోడీ ప్రభుత్వం పద్మావత్‌ ను బ్యాన్ చేయలేదని ఆ ఆగ్రహ జ్వాలల ఫలితమే బీజేపీ ఓటమి అంటోంది. అయితే ఇక్కడో మెలిక పెట్టింది కర్ణిసేన. మూడు స్థానాల్లో గెలిచింది కాంగ్రెస్‌ పార్టీ కాదనీ అది కర్ణి సంఘర్ష్ సమితి విజయం అంటోంది. పద్మావత్ విషయంలోలాగే బీజేపీ నేతలు ప్రజల డిమాండ్లను పట్టించుకోకపోతే భవిష్యత్‌ ఎణ్నికల్లోనూ రాజస్థాన్ బై పోల్‌లో వచ్చిన ఫలితాలే తప్పదని కర్ణిసేన మోడీ సర్కారును హెచ్చరించింది.

English Title
Karni Sena celebrates Congress victory in Rajasthan bypolls

MORE FROM AUTHOR

RELATED ARTICLES