కన్నడ ఫలితం... ఫ్రంట్‌ను ముందుకు తోస్తుందా?

Submitted by santosh on Fri, 05/11/2018 - 14:27
karnataka results

కర్ణాటకలో పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఓటర్లు.. ఈసారి ఎవరికి పట్టం కడతారోనని అన్ని పార్టీలు తెగ టెన్షన్ పడుతున్నాయి. ఐతే.. కర్ణాటకలో పోటీ చేయకుండానే టీఆర్ఎస్‌లోనూ అదే రకమైన ఆందోళన కనిపిస్తోంది. కన్నడ ఫలితాలు.. ఫెడరల్ ఫ్రంట్ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయన్న అంచనాతో.. కేసీఆర్ కర్ణాటక పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగియడంతో.. కార్యకర్తలు, నేతలు కాస్త రిలాక్స్ అ్యయారు. కానీ.. పోలింగ్ ముగిసేదాకా తమ ఓట్లు చేజారకుండా చూసుకునేందుకు.. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌తో పాటు ఇతర పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. గెలుపు మీద కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్.. బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నా.. లోలోపల మాత్రం ఆందోళన పడుతున్నాయి. ఏ పార్టీ గెలిచినా.. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై.. కన్నడ ఫలితాలు తప్పక ప్రభావం చూపిస్తాయి. ఐతే.. పక్క రాష్ట్రం ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేని టీఆర్ఎస్‌లోనూ అదే స్థాయిలో టెన్షన్ కనిపిస్తోంది. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ.. కేసీఆర్‌తో సహా పార్టీ నేతలందరిలోనూ నెలకొంది.

జాతీయ రాజకీయాల్లో దూకుడు పెంచిన కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కర్ణాటక జేడీఎస్ అధినేత దేవేగౌడతో సమావేశమై తన మద్దతు ప్రకటించారు. కర్ణాటక- హైదరాబాద్ రీజియన్‌లో ప్రచారం కూడా చేస్తానని ప్రకటించారు. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవేవీ సాధ్యపడవనే అభిప్రాయానికి వచ్చినట్లున్నారు. ఐతే.. కర్ణాటకలో కేసీఆర్ అంచనాలకు భిన్నంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలో ఎవరికో అక్కడి ప్రజలు కడతారని సర్వేల్లో తేలింది. మెజారిటీ సభ్యుల ప్రజలు కాంగ్రెస్‌కు జై కొట్టగా.. వివిధ సర్వేల్లో బీజేపీకి పట్టం కట్టారు. కింగ్ మేకర్ అవుతందనుకున్న జేడీఎస్ ప్రభావం కూడా నామామాత్రంగానే ఉంటుందని తెలిలిసింది.

కన్నడ ప్రీ పోల్ సర్వే ఫలితాలు కొంచెం తారుమారైనా.. ఫెడరల్ ఫ్రంట్‌కు ఇబ్బందికరమనే భావన టీఆర్ఎస్‌లో నెలకొంది. జాతీయ పార్టీల్లో ఏది గెలిచినా.. థర్డ్ ఫ్రంట్‌ను ప్రజలు ఆదరించరని తేలిపోతుంది. అలాంటప్పుడు ఆ రెండు పార్టీలను కాదని.. కేసీఆర్‌తో జట్టుకట్టే ప్రాంతీయ పార్టీలు పెద్దగా ఉండవు. ఇదే అభిప్రాయాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాటు ఇతరులు ఇప్పటికే స్పష్టం చేసారు. అందువల్ల.. ఇప్పుడే ఫెడరల్ ఫ్రంట్ అని హడావుడి చేసినా.. పెద్దగా ప్రయోజనం ఉండదని ఫిక్సయ్యారు. అందుకే.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌‌తోనూ మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు.

ఏదేమైనా.. కర్ణాటక ఫలితాలను బట్టి తదుపరి అడుగు వేయాలని భావిస్తున్నారు. అందుకే కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఏలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. ఫలితాలు వన్ సైడ్ గా ఉంటే ఫెడరల్ ఫ్రంట్ కు చుక్కెదురు తప్పదని భావిస్తున్నారు.

English Title
karnataka results

MORE FROM AUTHOR

RELATED ARTICLES