చూయింగ్‌గమ్‌ నమిలినందుకు ఐఎఎస్‌ అధికారి సస్పెండ్

x
Highlights

బెంగళూరులో ఒక ప్రొబెషనరీ ఐఎఎస్‌ అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రొబెషనరీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి గెహ్లాట్.. కర్నాటక రాష్ట్ర గీతాన్ని అవమానించారు....

బెంగళూరులో ఒక ప్రొబెషనరీ ఐఎఎస్‌ అధికారిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రొబెషనరీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి గెహ్లాట్.. కర్నాటక రాష్ట్ర గీతాన్ని అవమానించారు. తుమకూరు జిల్లాలోని సిరాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. రాష్ట్ర గీతం ఆలపిస్తున్న సమయంలో సీఎంతో పాటు ఇతర అధికారులు వేదికపై నిలుచుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి కూడా గీతాలాపన కోసం నిలబడ్డారు. కానీ ఆమె ఆ గీతాన్ని అవమానించారు. పాట వస్తున్న సమయంలో కలెక్టర్ ప్రీతి చువింగ్ గమ్ నములుతూ కనిపించారు. రాష్ట్ర గీతం ముగిసిన తర్వాత కూడా ఆమె అలాగే చుయింగ్ నములుతూ ఉన్నది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన నేపధ్యంలో పలు విమర్శలు ఎదురయ్యాయి. దీంతో కర్నాటక ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రత్నప్రభ ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories