కాంగ్రెస్, జేడీఎస్‌కు షాక్ ఇచ్చిన యెడ్డి..రేపే ముహూర్తం!

Submitted by nanireddy on Wed, 05/16/2018 - 12:18
karnataka political updates

కర్ణాటకలో బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కాంగ్రెస్ , జేడీఎస్ లకు షాక్ ఇచ్చారు. రేపు ప్రమాణస్వీకారానికి రెడీ అయ్యారు.. మరోవైపు ఫుల్ మెజారిటీ లేనిదే ఎమ్మెల్యేల పరేడ్ కు అవకాశం లేదని గవర్నర్ చెబుతున్నారు. ఇవాళ యడ్యూరప్పను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన్ను తమ శాసనసభపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో రేపు ప్రమాణస్వీకారం చేయనున్నట్టు యడ్డీ తెలిపారు.. ఈ క్రమంలో జేడీఎస్ లోని రేవణ్ణ వర్గం ఎమ్మెల్యేలు యెడ్డీకి సపోర్ట్ చేస్తున్నారన్న అనుమానం మరింత బలపడింది. పరిస్థితిని ముందుగానే అంచనా వేసి కొందరు ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రిసార్ట్ లకు తరలిస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్న తరుణంలో యడ్యూరప్ప రేపు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిసాగిస్తోంది. ఎక్కడ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళిపోతారోనన్న భయం కాంగ్రెస్ , జేడీఎస్ లో కలుగుతోంది. ఇదిలావుంటే జేడీఎస్ నేత రేవణ్ణ మాత్రం జేడీఎస్ లో చీలిక లేదని చెబుతున్నారు.. తమ ఎమ్మెల్యేలంతా కుమారస్వామిని ఏకగ్రీవంగా శాసనసభపక్ష నేతగ ఎన్నుకున్నారని వెల్లడించారు. 

English Title
karnataka political updates

MORE FROM AUTHOR

RELATED ARTICLES