బిగ్ బ్రేకింగ్ : కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు వారికే అవకాశమిచ్చిన గవర్నర్

Submitted by nanireddy on Wed, 05/16/2018 - 21:03
karnataka-politica-updates

కర్ణాటకలో అనుకున్నదే అయింది. రెండు రోజుల హడావుడికి రేపటితో తాత్కాలిక ఊరట లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా సింగల్ లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీ ని ఆదేశించారు గవర్నర్ వజూభాయ్..ఈ మేరకు బీజేపీ శాసనసభా పక్షనేత యడ్యూరప్పకు సమాచారమందించారు. దీంతో కాంగ్రెస్ , జేడీఎస్ పార్టీలు ఖంగుతిన్నాయి.. గవర్నర్‌ నిర్ణయంపై మండిపడ్డ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇదిలావుంటే గురువారం మధ్యాహ్నం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు యడ్డీ ప్రకటించడంతో బీజేపీ శ్రేణులు ప్రమాణస్వీకార ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ వద్దకు యెడ్డీ చేరుకోనున్నారు.. ఎమ్మెల్యేల పరేడ్ కు 7 రోజుల గడువు కోరే అవకాశముంది. కాగా ఇంతకుముందు అనుకున్నట్టే రాష్ట్రంలో సింగల్ లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీకే అవకాశమిచ్చారు గవర్నర్. 

English Title
karnataka-politica-updates

MORE FROM AUTHOR

RELATED ARTICLES