కర్ణాటక స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం

కర్ణాటక స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం
x
Highlights

కర్ణాటకలో అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలు కాంగ్రెస్‌ జెడిఎస్ సంకీర్ణానికి బూస్టింగ్ ఇచ్చాయి. బిజెపికి పరాభవాన్ని కలిగించాయి. మొత్తం 2664 వార్డుల్లో బిజెపి...

కర్ణాటకలో అర్బన్ లోకల్ బాడీ ఎన్నికలు కాంగ్రెస్‌ జెడిఎస్ సంకీర్ణానికి బూస్టింగ్ ఇచ్చాయి. బిజెపికి పరాభవాన్ని కలిగించాయి. మొత్తం 2664 వార్డుల్లో బిజెపి కేవలం 927 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. పట్టణ ప్రాంతాల్లో కూడా బిజెపి అనుకున్నఫలితాలు సాధించలేక ఢీలా పడిపోయింది.

కర్ణాటకలో జరిగిన స్థానిక ఎన్నికలు బిజెపికి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాల్లో గెలుపొంది అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం జరిగిన స్థానిక ఎన్నికల్లో మాత్రం కుదేలయింది. రెండం స్థానానికి పడిపోయింది. 2664 స్థానాల్లో కేవలం 927 స్థానాలను మాత్రమే సాధించింది. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంది. హస్తం పార్టీ మొత్తంగా 982 స్థానాల్లో గెలుపొందింది. జెడిఎస్ 357 స్థానాల్లో విజయం సొంతం చేసుకుంది. ప్రజల ఇచ్చిన తీర్పును కర్ణాటక ముఖ్యమంత్రి తనదైన శైలిలో విశ్లేషించారు. కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచారని కుమారస్వామి అన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలపై కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుండూరావు సంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్, జెడిఎస్ కలిసి పనిచేస్తే బిజెపిని తుదముట్టిండం సాధ్యమేనని అన్నారు. రానున్నలోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి మంచి ఫలితాలు సాధిస్తాయని గుండూరావు ధీమా వ్యక్తం చేశారు.

స్థానిక ఎన్నికల ఫలితాలు బిజెపి చేదు అనుభవాన్ని మిగిల్చినప్పటికీ ఆ పార్టీ నేతలు భవిష్యత్తుపై ఆశతో ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలపై స్థానిక ఎన్నికల ప్రభావం అస్సలు ఉండదని మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నాయకుడు ఇనయతుల్లాఖాన్ తుముకూర్‌లో చేపట్టిన విజయోత్సవ ర్యాలీపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు 10 మంది గాయాలపాలయ్యారు. వీరందరినీ సమీపంలో ఆసుపత్రిలో చేర్చారు. దాడికి పాల్పడింది ఎరవనేది ఇంకా తెలియాల్సి ఉంది. దాడికి ఉపయోగించిన ద్రవపదార్ధం ప్రమాదకరమైనది కాదని, బాత్ రూమ్ క్లీనర్ అయివుండవచ్చని డాక్టర్లు అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories