హెచ్‌ఐవీ సోకిన మహిళ చెరువులో పడి చనిపోయిందని తెలిసి..

Submitted by chandram on Thu, 12/06/2018 - 16:08
Karnataka

కర్నాటకలోని మొరాబ్ గ్రామస్థులు ఎయిడ్స్ సోకిన మహిళ ఓ చెరువులో పడి దుర్మరణం చెందింది. దింతో హుటాహుటినా ఆప్రమత్తమైన గ్రామస్తులు ఆ చెరువులోని నీటిని మోటార్లతో తోడారు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని మొరబ్ గ్రామంలోని గ్రామస్థులు, సరస్సు నుండి నీటిని త్రాగడానికి నిరాకరించారు. ఎయిడ్స్ సోకినా మహిళ సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మహిళ యొక్క శరీరం నవంబర్ 29 న సరస్సులో కనిపించింది. దింతో నీటి వెంటనే కలుషితమైనది అనే వార్తా వ్యాపించింది, దింతో గ్రామస్తులకు భయం మొదలైంది. దింతో గ్రామస్థులు అధికారులకు పిర్యాదు చేశారు. కానీ అధికారులు అందుకు అంగీకరించలేదు. ఎలాగైనా నీటిని తోడేయాలని భావించిన గ్రామస్తులు స్వతహాగా మోటార్లను తీసుకొచ్చి నీటిని తోడేసే పనులు మొదలుపెట్టారు. ఎయిడ్స్ అంటువ్యాధే కాదని, నీటి ద్వారా వ్యాపించదని కేవలం లైంగిక సంబంధాల వల్ల, ఎయిడ్స్ సోకిన వ్యక్తి రక్తాన్ని ఎక్కించడం వల్ల సోకుతుందని అధికారులు చెప్పినా గానీ గ్రామస్తులు అధికారుల మాటలు బేఖాతార్ చేశారు. గ్రామస్థులు మాట్లాడుతూ తము స్వాయంగా శరిరాన్ని చెరువులో చూశామని చూసి కూడా ఎలా తాగామంటారని ప్రశ్నించారు. ఈ ఘటనపై నెటిజన్లు కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

English Title
Karnataka Lake Drained After HIV+ Woman's Half-Eaten Body Found Floating

MORE FROM AUTHOR

RELATED ARTICLES