సంచలనం సృష్టిస్తున్న బీజేపీ

Submitted by nanireddy on Tue, 05/15/2018 - 09:38
karnataka election updates

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ 98 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా అధికార కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. జేడీఎస్ 32 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇక బళ్లారి జిల్లాలో పూర్తిగా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుందనే చెప్పాలి. ఇక దాదాపు 100 కు పైగా స్థానాల్లో  బీజేపీ గెలుపొంది రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చాముండేశ్వరిలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి సిద్ద రామయ్య వెనుకంజలో ఉన్నారు. బళ్లారి కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి,  అనుచర అభ్యర్థులు సైతం ముందజలో  ఉన్నారు. అంతేకాకుండా కర్ణాటకలో అధిక శాతం భలం కలిగివున్న లింగాయత్ సామజిక వర్గం దాదాపు బీజేపీకి సహకరించినట్టు తెలుస్తోంది.

English Title
karnataka election updates

MORE FROM AUTHOR

RELATED ARTICLES