యువతిపై హీరో అత్యాచారం

యువతిపై హీరో అత్యాచారం
x
Highlights

సుబ్రహ్మణ్యం అనే కన్నడ హీరో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ 23 ఏళ్ల యువతి పోలీసులను ఆశ్రయించింది. రాజాజినగర్‌కి చెందిన ఓ యువతి.. సుబ్రహ్మణ్యంతో...

సుబ్రహ్మణ్యం అనే కన్నడ హీరో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ 23 ఏళ్ల యువతి పోలీసులను ఆశ్రయించింది. రాజాజినగర్‌కి చెందిన ఓ యువతి.. సుబ్రహ్మణ్యంతో రెండేళ్లుగా ప్రేమలో ఉంది. వీరిద్దరి ప్రేమను అంగీకరించి పెద్దలు పెళ్లికి కూడా ఒప్పుకొన్నారు. కానీ షూటంగ్‌తో బిజీగా ఉన్నానని చెప్పి సుబ్రహ్మణ్యం పెళ్లి వాయిదా వేశాడు. నవంబర్‌ 1న తన సోదరి ఇంట్లో పార్టీ ఉందనిచెప్పి ఆ యువతిని ఇంటికి రమ్మన్నాడు. అక్కడ మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతి నిలదీయడంతో త్వరలో పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. కానీ ఇపుడు పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతుండటంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సబ్రహ్మణ్య పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలింపు చేపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories