ఏపీలో అవినీతి, అసమర్థ, అరాచక పాలన నడుస్తోంది : కన్నా

Submitted by arun on Mon, 06/11/2018 - 12:02
kanna

ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళన బాట పట్టింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం విజయవాడ ధర్నాచౌక్‌లో బీజేపీ మహాధర్నా చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, గోకరాజు గంగరాజు, మాణిక్యాలరావు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ టీడీపీ పాలనలో నియంతృత్వ ధోరణి పెరిగిపోయిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి, అసమర్థ, ఆరాచక పాలన నడుస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష‌్మినారాయణ విమర్శించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు మోసాలను, మాయమాటలను ప్రజలకు వివరిస్తామన్నారు. రాజకీయ లబ్దికోసం బీజేపీపై బురదజల్లుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు.

English Title
kanna lakshmi narayana slams cm chandrababu

MORE FROM AUTHOR

RELATED ARTICLES