రాహుల్ గాంధీతో భేటీ అయిన కమల్ హాసన్.. దానిపైనే చర్చ?

Submitted by nanireddy on Wed, 06/20/2018 - 18:54
kamal-haasan-to-meet-rahul-gandhi-at-delhi-residence

నటుడు కమల్ హాసన్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రాహుల్ నివాసంలో ఇద్దరు సమావేశమయ్యారు. ఇటీవల రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కమల్.. రాజకీయ నేతలతో భేటీ అవ్వడం ఇదే తొలిసారి. ఈ సందర్బంగా తమిళనాడులో పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు.కాగా ఈ భేటీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. ఇదిలావుంటే కమల్ హాసన్ కాంగ్రెస్ తో పొత్తు నేపథ్యంలోనే రాహుల్ ను కలిసినట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 

English Title
kamal-haasan-to-meet-rahul-gandhi-at-delhi-residence

MORE FROM AUTHOR

RELATED ARTICLES