మెగా హీరో వ‌ర్సెస్ నంద‌మూరి హీరో

Submitted by arun on Wed, 01/17/2018 - 15:15
Kalyan Ram And Ram Charan

టాలీవుడ్‌లో నంద‌మూరి హీరోల‌కు, మెగా హీరోల‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ రెండు ఫ్యామిలీల‌కు చెందిన హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బాక్సాఫీస్ వ‌ద్ద ఉండే హ‌డావిడి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ రోజు థియేట‌ర్ల వ‌ద్ద ఆయా హీరోల అభిమానుల‌తో పెద్ద పండ‌గ వాతావ‌ర‌ణ‌మే ఉంటుంది. అలాంటిది ఈ రెండు ఫ్యామిలీల హీరోలు న‌టించిన సినిమాలు ఒకేసారి థియేట‌ర్ల‌లోకి వ‌స్తే బాక్సాఫీస్ వార్ ఇంకెలా ఉంటుందో ?  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే మెగాపవర్ స్టార్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'రంగస్థలం' సినిమాను, మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. 

ఇక నంద‌మూరి హీరో నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ లేటెస్ట్ సినిమా ఎం.ఎల్‌.ఏ. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో, కథానాయికగా కాజల్ అలరించనుంది. ఈ సినిమాను మార్చి 28వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. వరుసగా మూడు రోజుల్లో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాయన్న మాట. ఇక ఎవరు లాభాలను మూటగడతారనేది చూడాలి. ఇలా రెండు రోజుల తేడాలో నంద‌మూరి  హీరో వ‌ర్సెస్ మెగా హీరో త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డుతుండ‌డంతో బాక్సాఫీస్ వార్‌ను హీటెక్క‌నుంది. మ‌రి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో ?  చూడాలి.      

English Title
Kalyan Ram And Ram Charan Movie clash in Tollywood

MORE FROM AUTHOR

RELATED ARTICLES