నెంబ‌ర్ షేర్ చేసిన భ‌ర్త‌కు కాజోల్ వార్నింగ్‌!

Submitted by arun on Tue, 09/25/2018 - 16:29
Kajol, Ajay Devgn

బాలీవుడ్ నటుడు అజయ దేవగన్ సోషల్ మీడియాలో చేసిన చిన్న పొరపాటు చివరకు తన భార్య కాజోల్ చేత చివాట్లు తినేవరకు వెళ్లింది. అంతేకాదు ట్విట్టర్ సాక్షిగా అజయ్ దేవగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నీ వేషాలేమైనా ఉంటే ఇంటి బయట వరకు ఒకే, ఒక వేళ ఇంట్లోకి నీ పైత్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు అని తేల్చి చెప్పింది. సోమవారం అజయ్ తన భార్య కాజోల్‌ను కోట్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. కాజోల్ ప్రస్తుతం విదేశాల్లో ఉంది. ఆమెతో మాట్లాడాలనుకుంటే ఈ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేయండి అని ట్వీట్ చేస్తూ ఓ నంబర్‌ను పోస్ట్ చేశాడు.

దాంతో చాలా మంది నెటిజన్లు ఆ నంబర్‌కు తెగ మెసెజ్‌లు పెట్టారు. కానీ కాజోల్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో కాజోల్ మాకు ఎలాంటి రిప్లై ఇవ్వడం లేదంటూ అజయ్ దేవ్‌గణ్‌కు వరుసగా ట్వీట్లు చేశారు. దీనిపై అజయ్ స్పందిస్తూ...‘సెట్స్‌లో ఫ్రాంక్ చేయడం పాత పద్దతి. కొంచెం వెరైటీగా మీతో ఫ్రాంక్ ప్లే చేశానంటూ అభిమానులకు ట్వీట్ చేశాడు. అజ‌య్ ప్రాంక్ వైర‌ల్ కావ‌డంతో కాజోల్ జోక్యం చేసుకుంది. సోష‌ల్ మీడియా ద్వారా భ‌ర్త‌కు వార్నింగ్ ఇచ్చింది. `మీ ప్రాంక్‌లు ఇప్పుడు సినిమా సెట్స్‌ల‌ను, స్టూడియోల‌ను కూడా దాటి వెళ్లిపోయాయ్‌. కానీ, ఇంట్లో ఇలాంటి వేషాలు కుద‌ర‌వు` అని భ‌ర్త‌కు కాజోల్ స‌ర‌దాగా వార్నింగ్ ఇచ్చింది.
 

English Title
Kajol Responds To Ajay Devgn's Twitter Prank With A 'No Entry At Home' Diktat

MORE FROM AUTHOR

RELATED ARTICLES