మందకృష్ణపై టీఆర్ఎస్‌‌ ఎదురుదాడి

Submitted by arun on Sat, 12/30/2017 - 11:42
Kadiyam Srihari

మందకృష్ట మాదిగపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేయాల్సింది గల్లీలో కాదు.. ఢిల్లీలో అని హితవు పలికారు. కేసీఆర్‌ను తిడుతూ బీజేపీ నేతలతో కలిసి తిరిగితే సమస్య పరిష్కారమవుతుందా అని  ప్రశ్నించారు. ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లేందుకు జనవరి 5 లోపు పీఎంవో నుంచి పిలుపు రాకపోతే.. అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో.. కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు కడియం.

English Title
Kadiyam Srihari fire on manda krishna madiga

MORE FROM AUTHOR

RELATED ARTICLES