ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుంది

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుంది
x
Highlights

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్. ఇండస్ట్రీలో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. కాని కాని ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో అంతా...

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్. ఇండస్ట్రీలో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్. కాని కాని ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో అంతా తారుమారైంది. దీంతో తారక్ తో చేసే సినిమాలో కాస్టింగ్ స్టోరీ ఇలా ప్రతి దాంట్లోనూ కాంప్రమైజ్. వీటికి దర్శకధీరుడు రాజమౌళి టెన్షన్ పెడుతున్నాడు. ఇన్ని రకాల టెన్సన్స్ తో తారక్ సినిమా త్రివిక్రమ్ కిఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లవుతోంది.

టాలీవుడ్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కాంబినేషన్ తారక్, త్రివిక్రమ్. ఎట్టకేలకు వీరి కాంబినేషన్ లో సినిమా మొదలైంది. అభిమానుల్లోనే కాదు..ఇండస్ట్రీలోనూ క్యూరియాసిటీ కలిగింది. పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా ఈ సినిమా ప్రారంభమైంది. కాని రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు.

తారక్ , త్రివిక్రమ్ కాంబినేష్ లో సినిమా రావాలని అందరికన్న ఎక్కువగా కోరుకున్నది తారకే. కాని అగ్నాతవాసి డిజాస్టర్ కావడం కాపీ కథ అని జరిగిన గొడవలతో ఒక దశలో ఈ సినిమా ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో త్రివిక్రమ్ తన మాట నెగ్గించుకోలేక పోయాడు. తారక్ దేవిశ్రీని కావాలంటే త్రివిక్రమ్ అనిరుధ్ కి ఓటేసాడు. దీంతో ఇద్దరూ కాదని థమన్ ని ఓకే చేసారు. ఇప్పుడేమో థమన్ కాదు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఇస్తున్నాడంటున్నారు. ఇలాంటి విషయాలు త్రివిక్రమ్ ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాడు.

ఇవన్నీ సరే అగ్నాతవాసి ప్లాప్ కావడంతో జరుగుతున్నాయనుకుందాం. వీటన్నింటినీ దాటుకుని ఎలాగోలా సినిమా మొదలు పెడదామనేలోగానే పిడుగులాంటి మరో వార్త. రాజమౌళి తారక్, చెర్రీ కాంబినేషన్ లో తీస్తున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు పెట్టబోతున్నాడు. దాని కంటే ముందు 45 రోజుల పాటు అంటే జులై నుంచి యాక్షన్ సీన్స్..గురించి ఇద్దరు హీరోలను కంప్లీట్ గా ట్రైనింగ్ తీసుకోమన్నాడట రాజమౌళి.

త్రివిక్రమ్ సినిమా అంటే మినిమమ్ ఆర్నెల్లు షూటింగ్ జరుపుకుంటుంది. ఆతర్వాత పోస్ట్ ప్రొడక్షన్.. తదితర కార్యక్రమాలు వెరసి 8 -9 నెలల సమయం పడుతుంది. ఇదంతా ఇప్పటివరకు జరిగిన కథ. కాని ఇప్పుడు నాలుగు నెలల్లో సినిమా షూటింగ్ ప్రొడక్షన్ అన్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత అంటే కుదరదు తన సినిమా పూర్తి కాగానే తారక్ రాజమౌళిషూటింగ్ లో పాల్గొంటాడు. రాజమౌళి సినిమా అంటే.. సినిమానే. పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు తీస్తాడు. దీంతో త్రివిక్రమ్ తన సినిమాను ఎట్టి పరిస్థితుల్లోగా జులైలోగా కంప్లీట్ చేయాల్సొస్తోంది. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో కెరీర్ లోనే మొదటిసారిగా త్రివిక్రమ్ టెన్షన్ పడుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories