వచ్చేవరకూ ఆగు.. లేదంటే చంపేస్తా

Submitted by arun on Sat, 07/14/2018 - 16:13
ntr

సెలెక్ట్ మొబైల్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ నిన్న బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ‘‘నేను రభస షూటింగ్‌లో స్విట్జర్లాండ్‌లో ఉన్నా. ప్రణతికి డెలివరీ టైమ్. ఎప్పుడు ఏం జరిగినా హాస్పిటల్‌కు వచ్చేయండి అని చెప్పా. ఒకరోజు షూటింగ్ గ్యాప్‌లో మా ఆవిడతో మాట్లాడుతుంటే తేడాగా ఉంది. వెంటనే నిన్ను నేను చంపేస్తాను. నేనిక్కడ ఉన్నాను. నువ్వు అప్పుడే కనేయకు నేనొచ్చేవరకూ ఆగు అన్నాను. ‘లేదులే బాగానే ఉంటుంది’ అంది. సడెన్‌గా నేను పొద్దుటే ల్యాండ్ అయి ఇంటికి వస్తుంటే మళ్లీ ఫోన్ చేసింది. ఎక్కడున్నావు అంటే హాస్పిటల్‌కి వెళ్తున్నా అంది. నా గుండె ఆగిపోయింది. హాస్పిటల్‌కు వెళ్లడం ఏంటి అని. చెకప్ కోసం వెళ్తున్నా అని అబద్దం చెప్పింది.
 
అప్పుడు ప్రణతితో మా అమ్మగారు ఉన్నారు. సరే నువ్వెళ్లు నేనింటికి వెళ్తున్నా. ఏదైనా ఉంటే చెప్పు అని నేను ఇంటికెళ్లి కాఫీ తాగుతుంటే మా అమ్మ ఫోన్ చేయగానే గుండె ఆగిపోయింది. లిట్రల్‌గా బాడీ చల్లబడిపోయింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అమ్మా ఎంతసేపట్లో వచ్చేయాలి హాస్పిటల్‌కి అనడిగా. టైమ్ లేదు ఎంత ఫాస్ట్‌గా వస్తే అంత బాగుంటుంది అంది. వెంటనే బయల్దేరి అలా వెళ్లాను అప్పుడే మా పెద్దబ్బాయి పుట్టాడు. కొంచెం ఏమాత్రం లేటయినా ఆ సమయానికి నేను లేకపోయేవాడిని. అదంతా ఫోన్ కారణంగానే అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.

English Title
Jr NTR as Brand Ambassador for CELEKT mobiles

MORE FROM AUTHOR

RELATED ARTICLES