భారీ ధర పలికిన 'అరవింద సమేత' శాటిలైట్ హక్కులు.. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ది బెస్ట్!

Submitted by arun on Tue, 08/07/2018 - 12:47
as

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో రూపొందుతోన్న చిత్రం 'అరవింద సమేత'.  ప్రకటన రోజు నుండే భారీ అంచనాల్ని మూటగట్టుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తొలిసారి త్రివిక్రమ్, తారక్ లు కలిసి సిసినిమా చేస్తుండటంతో బిజినెస్ సర్కిల్స్ లో కూడా చిత్రంపై హైప్ బాగానే ఉంది. ‘అరవింద సమేత’ శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ ఏకంగా రూ.23.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద శాటిలైట్ డీల్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఏ చిత్ర శాటిలైట్ హక్కులు ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోలేదు. అంతేకాదు ‘బాహుబలి 2’ తరవాత శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయిన రెండో చిత్రమిది. 

ఇదిలా ఉంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగుందట. చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారానే రూ.70 నుంచి రూ.80 కోట్ల బిజినెస్ జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి త్రివిక్రమ్ గత చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ కావడంతో ఆ ప్రభావం ‘అరవింద సమేత’పై పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ‘అరవింద సేమత’పై అంచనాలు క్రియేట్ చేయడంపై దర్శక, నిర్మాతలు సఫలమయ్యారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ‘అరవింద సమేత’ ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ఎన్టీఆర్ వరస హిట్లతో జోరు మీద ఉండటంతో ‘అరవింద సమేత’ కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఏరియాల వారిగా థియేట్రికల్ రైట్స్ కూడ భారీ మొత్తం పలుకుతున్నాయి.  హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదలచేయనున్నారు.  ఈ చిత్రంలో తారక్ స్నేహితుడిగా సునీల్ నటిస్తుండటం విశేషం.    

English Title
Jr NTR Aravinda Sametha Satellite record

MORE FROM AUTHOR

RELATED ARTICLES