ఎన్టీఆర్ కొంచెం కొత్త‌గా

Submitted by lakshman on Fri, 03/02/2018 - 17:36
Jr NTR and Trivikram Movie combination

వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ క్రమంలో త్రివిక్రమ్ తో తన తదుపరి సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే మొదలుకావాల్సివుంది. కానీ ఆలస్యమవుతూ వస్తోంది. దీంతో ఈసినిమా ప్రారంభం కాకుండానే ఈ సినిమా పై ఇప్పటికే అనేక గాసిప్పులు హడావిడి  చేసాయి. వాస్తవానికి త్రివిక్రమ్ ఇప్పటివరకు జూనియర్ ఏసినిమాలోను కనిపించని విధంగా    ఎన్టీఆర్ లుక్ ఉండాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ స్టీవెన్స్ సమక్షంలో ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తివిక్రమ్ కోరుకున్న లుక్ వచ్చేలా తరచుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ లు కలుస్తూ ఈ లుక్ గురించి చాలా లోతైన చర్చలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఎన్టీఆర్ లుక్ ఫైనల్ అయ్యాకే ఈ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది అన్న వార్తలు వస్తున్నాయి.  ఈ కారణాల వల్లే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే తేదీ ఆలస్యం అవుతోందని అని అంటున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 26 నుండి జరుపుకోనుంది.

English Title
Jr NTR and Trivikram Movie combination

MORE FROM AUTHOR

RELATED ARTICLES