ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన.. ఉచితంగా జియో ఫోన్లు!

Highlights

రిల‌యెన్స్ మ‌రో అద్భుతం చేసింది. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో ఉన్న 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను ఇండియ‌న్స్ అంద‌రికీ ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు రిల‌యెన్స్ అధినేత ముకేష్...

రిల‌యెన్స్ మ‌రో అద్భుతం చేసింది. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో ఉన్న 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ను ఇండియ‌న్స్ అంద‌రికీ ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు రిల‌యెన్స్ అధినేత ముకేష్ అంబానీ ప్ర‌క‌టించారు. ఆగ‌స్ట్ 15న ఈ ఫీచ‌ర్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తేనున్నారు. ఆగ‌స్ట్ 24 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయ‌ని తెలిపారు. అయితే ఉచితాన్ని మిస్ యూజ్ చేయొద్ద‌న్న కార‌ణంగా రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోనున్న‌ట్లు అంబానీ చెప్పారు. దీనిని మూడేళ్ల త‌ర్వాత తిరిగి చెల్లిస్తామ‌ని అంబానీ స్ప‌ష్టంచేశారు. ఈ జియో ఫోన్‌లో అదిరిపోయే ఫీచ‌ర్లు ఉన్నాయి. ఇది పూర్తిగా మేడిన్ ఇండియా ఫోన్ అని ఆయన చెప్పారు. రిలయన్స్ జియో ఫోన్‌ 22 భారతీయ భాషలను కలిగి ఉంటుందని ముఖేష్ తెలిపారు. 2.4 అంగుళాల స్క్రీన్‌తో ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. వాయిస్ కమాండ్‌తో కూడా ఈ ఫోన్ పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. నెలకు రూ.153 చెల్లిస్తే అన్‌లిమిటెడ్ డేటా, ఇంకా వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. మిగిలిన డేటా ప్రొవైడర్లతో పోల్చుకుంటే వాళ్లు వసూలు చేస్తున్న చార్జీలో కేవలం 3శాతం చెల్లిస్తే చాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories