ఎమ్మెల్యేల విచిత్ర డిమాండ్.. అసెంబ్లీలోనే మద్యం అమ్మాలి

ఎమ్మెల్యేల విచిత్ర డిమాండ్.. అసెంబ్లీలోనే మద్యం అమ్మాలి
x
Highlights

మద్యం నిషేదించాలని మహాత్ముడి కల. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా ఇది కలగానే మిగిలిపోయింది. ఈ విషయంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు...

మద్యం నిషేదించాలని మహాత్ముడి కల. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా ఇది కలగానే మిగిలిపోయింది. ఈ విషయంలో ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఏకంగా అసెంబ్లీలోనే మందు అమ్మాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల జార్ఖండ్ ప్రభుత్వం మద్యం దుకాణాల లైసెన్స్ రద్దు చేసింది. స్వయంగా వైన్ షాపులు తెరిచింది. సర్కార్ మద్యం షాపులు తక్కువ సంఖ్యలో ఉండడంతో భారీగా క్యూలైన్లు ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. వైన్ షాపుల వద్ద మందు బాబుల రద్దీ, హంగామా చూసి ఎమ్మెల్యేలు జడుసుకుంటున్నారు. మద్యం కొనుగోలు కోసం వెళ్లిన ఎమ్మెల్యేల అనుచరులు ఖాళీ చేతులతో వెనక్కి వస్తున్నారు. కిక్ మిస్ అవుతున్నామంటూ జార్ఖండ్ ఎమ్మెల్యేలు వర్రీ అవుతున్నారు.

మద్యం కరవును రూపుమాపేందుకు ఏకంగా అసెంబ్లీలోనే మద్యం షాపు ఓపెన్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని లేవనెత్తాలని నిర్ణయించాయి. స్పీకర్, సీఎంలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. శాసనసభలో మద్యం విక్రయించాలనే ప్రతిపక్షాల డిమాండ్ ను అధికార పక్ష ఎమ్మెల్యేలు సైతం సపోర్టు చేస్తున్నారు. కిక్ కోసం తపించుపోతున్న ఎమ్మెల్యేల తీరును చూసి జనం నోళ్లు వెలగబెడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories