ఆ అవకాశం వస్తే.. విజయ్‌ దేవరకొండలా మారిపోతా

Submitted by arun on Mon, 11/26/2018 - 14:42

ఇటీవల విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ సినిమా చేయనున్నట్టు ఒక వార్త షికారు చేసింది. ఆ వార్తలో నిజం లేదు గానీ, జాన్వీ కపూర్ నోట విజయ్ దేవరకొండ మాట వచ్చిందనేది మాత్రం వాస్తవం. కరణ్ జోహర్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షోకు ఇటీవల శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వెళ్లింది. ఆ సమయంలోనే 'రేపు పొద్దున్న నిద్రలేవగానే నువ్వొక మగాడిగా మారిపోతావ్' అంటే, ఎవరిలా మారిపోవాలని కోరుకుంటావు?' అనే ప్రశ్న జాన్వీకి ఎదురైంది. దీనికి జాన్వీ కపూర్ తడుముకోకుండా.. విజయ్ దేవరకొండ అంటూ సమాధానం ఇచ్చింది. అంతే కాదు తనతో సినిమా చేయాలనే కోరికని కూడా బయట పెట్టింది. జాన్వీ సమాధానం విన్న తరువాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడారు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్ గా మారాడని తెలిపారు. ఆ చిత్రాన్ని ప్రస్తుతం హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. విజయ్ దేవరకొండ సెక్సీ సౌత్ ఇండియన్ స్టార్ అంటూ కరణ్ జోహార్ కితాబిచ్చేశారు. ఈ షోతో జాన్వీ కపూర్, విజయ్ దేవరకొండ చిత్రం గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 

English Title
jhanvi kapoor talk about vijay devarakonda

MORE FROM AUTHOR

RELATED ARTICLES