కూతురు జాన్వి కోసం శ్రీదేవి లాబీయింగ్

కూతురు జాన్వి కోసం శ్రీదేవి లాబీయింగ్
x
Highlights

హీరోలే కాదు హీరోయిన్లు కూడా తమ వారసురాళ్లకోసం , హీరోయిన్ గా కంటే తల్లిగా పడే తపనే వేరు. ఏకంగా బాలీవుడ్ నెంబర్ వన్ అనిపించుకున్న శ్రీదేవే, తన కూతురు...

హీరోలే కాదు హీరోయిన్లు కూడా తమ వారసురాళ్లకోసం , హీరోయిన్ గా కంటే తల్లిగా పడే తపనే వేరు. ఏకంగా బాలీవుడ్ నెంబర్ వన్ అనిపించుకున్న శ్రీదేవే, తన కూతురు కోసం కష్టపడాల్సివస్తోంది...కూతురు జాన్వి లాంచింగ్ కోసం, ఎన్నో లాబీయింగ్ లు, కరణ్ జోహార్ అండ్ కో సపోర్ట్ తీసుకుంటోంది
మరాఠా హిట్ సైరాత్ హిందీ రీమేక్ లో శ్రీదేవి తన కూతురు జాన్వీని హీరోయిన్ గా లాంచ్ చేస్తోంది. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కమ్, డైరెక్టర్ కరన్ జోహార్ సపోర్ట్ కూడా తీసుకుంటోంది. అసలు హీరోయిన్ లాంచింగ్ ప్రోగ్రామ్ కి రెండేళ్ల ముందునుంచే, జాన్వీని అన్ని ఫంక్షన్లకు తిప్పుతూ, బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల ద్రుష్టిలో పడేందుకు శ్రీదేవి తెగ కష్టపడింది...కష్టపడుతూనేఉంది.
వారసుల లాంచింగ్ కోసం వాళ్ల తండ్రులే కాదు, కూతుళ్లకోసం వెటరన్ హీరయిన్లు అంతే తపన పడ్డారు....ఒకప్పటి అంతాల తార రాధ తన పెద్ద కూతురు కార్తికని నాగచైతన్య మూవీ జోష్ తో తెలుగులో బానే లాంచ్ చేసింది..కాని టాలీవుడ్ , కోలీవుడ్ లో కార్తిక నిలదొక్కుకోలేకపోయింది..తర్వాత రెండో కూతురు తులసిని మణిరత్నం మూవీ కడలితో లాంచ్ చేసింది....తను కూడా నిలదొక్కుకోలేకపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories