ఎస్ బీ ఐలో భారీ కుంభ‌కోణం..రూ.824కోట్ల‌కు ముంచిన క‌నిష్క్ జ్యువెలరీ

Submitted by lakshman on Wed, 03/21/2018 - 14:26
Jewellery chain Kanishk Gold defrauds 14 banks to tune of Rs 824.15 crore

బ్యాంకులకు కుచ్చుటోపీ పెడుతున్న సంస్థల బాగోతాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. నీరవ్ మోడీ కుంభకోణంతో దేశంలో సర్వత్రా చర్చ జరుగుతున్నవేళ.. వరుసగా కుంభకోణాలు బయటపడుతుండటం ఆందోళన రేకెత్తించే అంశం.
 ప్రముఖ జ్యువెలరీ సంస్థ కనిష్క్ కూడా తాజాగా కుంభకోణాల జాబితాలో చేరింది. ఈ సంస్థ బ్రాంచిలు చెన్నైతో పాటు హైదరాబాద్, కొచ్చిన్, ముంబైలలో కూడా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.824కోట్ల దాకా రుణాలు పొందిన ఆ సంస్థ.. తిరిగి వాటిని చెల్లించలేదు. కుంభకోణం వెలుగుచూడటంతో.. రాత్రికే రాత్రి దుకాణాలు మూసివేసి.. రికార్డులను మాయం చేసేసింది.
 వేలకోట్ల కుంభకోణానికి పాల్పడిన చెన్నైకు చెందిన కనిష్క్‌ గోల్డ్‌ జ్యుయలరీ ప్రమోటర్లు విదేశాలకు చెక్కేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ సీబీఐని ఆశ్రయించింది. నిందితులు మారిషస్ పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.
 కాగా, రూ. 824 కోట్ల రూపాయల రుణాల ఎగవేతకు సంబంధించి కనిష్క్‌ జ్యువెలరీ యజమాని, డైరెక్టర్లు భూపేష్‌ కుమార్‌ జైన్‌, అతని భార్య నీతా జైన్‌పై ఎస్‌బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. మొత్తం 14 బ్యాంకుల కన్సార్టియం ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి కోట్ల పైచిలుకు రుణాలను కనిష్క్‌ గోల్డ్‌ జ్యువెలరీ పొందినట్టు తెలుస్తోంది. గతేడాది నవంబర్ నెలలోనే కనిష్క్ గోల్డ్ సంస్థను రుణ ఎగవేత జాబితాలో చేర్చాయి బ్యాంకులు. అంతకుముందు సెప్టెంబర్ నెలలో కనిష్క్‌ గోల్డ్ వ్యవస్థాపకుడు భూపేష్‌ కుమార్‌ జైన్‌ రూ. 20 కోట్ల ఎక్సైజ్ టాక్స్ మోసం కేసులో అరెస్టు అయ్యాడు. ఆ కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన భూపేష్.. అప్పటినుంచి భార్యతో సహా పరారీలోనే ఉన్నాడు. 

English Title
Jewellery chain Kanishk Gold defrauds 14 banks to tune of Rs 824.15 crore

MORE FROM AUTHOR

RELATED ARTICLES