జేసీ బ్రదర్స్‌ దౌర్జన్యాలపై రోడ్డెక్కిన టీడీపీ నేతలు

Submitted by arun on Wed, 01/03/2018 - 14:36
tdp

జేసీ బ్రదర్స్ దౌర్జన్యాలపై తాడిపత్రి నియోజకవర్గంలోని ఓవర్గం టీడీపీ నేతలు బుధవారం రోడ్డెక్కారు. టీడీపీ కార్యకర్త శేఖర్‌కు చెందిన అన్నాట్రాన్స్ పోర్టులో జేసీ వర్గీయులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఒక కారు, లారీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం  చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగడాలకు నిరసనగా పోలీసు స్టేషన్‌ వద్ద టీడీపీ కార్యకర్తలతో కలిసి నేతలు జయచంద్రారెడ్డి, కాకర్ల రంగనాథ్‌  బైఠాయించారు. వెంటనే జేసీ సోదరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

English Title
JC Brothers voilence

MORE FROM AUTHOR

RELATED ARTICLES