సంచలనంగా మారిన జయలలిత ఆస్పత్రి దృశ్యాలు

Submitted by lakshman on Wed, 12/20/2017 - 17:18

జయ మరణం తర్వాత తమిళనాడులో తీవ్ర సంచలనాలకు కేంద్ర బిందువైన ఆర్కేనగర్‌ ఉపఎన్నికకు.... సరిగ్గా ఒక్కరోజు జయలలిత ఆస్పత్రి దృశ్యాలు బయటికి రావడం సంచలనంగా మారింది. ఆర్కేనగర్‌ ఓటర్లను ప్రలోభపెట్టేందుకే వీడియోను రిలీజ్‌ చేశారని అధికార పార్టీ అన్నాడీఎంకే ఆరోపించింది. ప్రతిపక్ష డీఎంకే కూడా దినకరన్‌ వర్గంపై మండిపడింది. ఇన్నిరోజులూ వీడియోను బయటపెట్టకుండా.... సరిగ్గా ఒక్కరోజు ముందే ఎందుకు వీడియోను విడుదల చేశారంటూ ప్రశ్నించాయి. రాజకీయ లబ్ధి కోసమే వీడియో‌ను రిలీజ్‌ చేశారంటూ అటు అన్నాడీఎంకే, ఇటు డీఎంకే రెండూ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశాయి. దినకరన్‌ మద్దతుదారుడు వెట్రివేల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. 

English Title
Jayalalithaa's Video Released

MORE FROM AUTHOR

RELATED ARTICLES