బాత్రూంలో ప‌డి ఆస్ప‌త్రిపాలైన జ‌య‌ల‌లిత : శ‌శిక‌ళ‌

బాత్రూంలో ప‌డి ఆస్ప‌త్రిపాలైన జ‌య‌ల‌లిత : శ‌శిక‌ళ‌
x
Highlights

త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత ఎందుకు మ‌ర‌ణించింది అనే విష‌యంపై ఆమె స్నేహితురాలు శ‌శిక‌ళ విచార‌ణ క‌మిష‌న్ కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. జ‌య‌ల‌లిత...

త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత ఎందుకు మ‌ర‌ణించింది అనే విష‌యంపై ఆమె స్నేహితురాలు శ‌శిక‌ళ విచార‌ణ క‌మిష‌న్ కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. వైద్యం కోసం ఆస్ప‌త్రిలో ఉండ‌గా ఆమెను చూసేందుకు బంధువ‌ల్ని, కుటుంబ‌స‌భ్యుల్ని ఎందుకు క‌ల‌వ‌నివ్వ‌లేదు.అమ్మ స‌హ‌జ‌మ‌ర‌ణం కాద‌ని , ఎవ‌రో హ‌త్య చేసి ఉంటాయ‌నే ఆరోప‌ణ‌లు త‌లెత్తాయి. దీంతో జ‌య‌ల‌లిత కేసు విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆ రాష్ట్ర‌ప్ర‌భుత్వం విచార‌ణ క‌మిష‌న్ ను ఏర్పాటు చేసింది. ఆ క‌మిటీ జ‌య ఎలా మ‌ర‌ణించింది..? ఆమె ఆస్ప‌త్రిలో చేర‌డానికి కార‌ణాలేంటీ..? అనే విష‌యాల‌పై విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ‌లో భాగంగా జ‌య‌ల‌లిత స్నేహితురాలు శ‌శిక‌ళ అనేక విష‌యాల్ని వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది.
సెప్టెంబ‌ర్ 22,2016న రాత్రి తొమ్మిదిన్న‌ర స‌మ‌యంలో బ్ర‌ష్ చేయ‌డానికి వెళ్లిన జ‌య‌ల‌లిత బాత్రూంలో జారిప‌డ్డార‌ని, అప్ప‌టికే తీవ్ర‌జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న ఆమె లేచేందుకు స‌హాయంగా త‌న‌ని పిలిచిన‌ట్లు శ‌శిక‌ళ క‌మిష‌న్ విచార‌ణ స‌భ్యుల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.
అనంత‌రం బెడ్ పైన ఆమెను ప‌డుకోబెట్ట‌గా కొద్దిసేప‌టికి ఆమె స్పృహ కోల్పోయారాని , దీంతో జ‌య‌ల‌లిత స్నేహితుడు డాక్ట‌ర్ శివ‌కుమార్ కు స‌మాచారం అందించిన‌ట్లు చెప్పుకొచ్చింది. శివ‌కుమార్ వ‌చ్చి వైద్య ప‌రీక్ష‌లు చేసిన అనంత‌రం జ‌య‌ల‌లిత‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ పంపించాల‌ని అపోలో ఆస్ప‌త్రివైస్ చైర్ ప‌ర్స‌న్ ప్రీతారెడ్డి భ‌ర్త విజయ్‌కుమార్ రెడ్డికి పోన్ చేసిన‌ట్లు శ‌శిక‌ళ చెప్పింది.
ఆస్ప‌త్రి నుంచి వ‌చ్చిన అంబులెన్స్ లో జ‌య‌ల‌లిత తీసుకెళుతుండ‌గా ఆమె రెండుసార్లు లేచిన‌ట్లు, తన‌ని ఎక్క‌డి తీసుకెళుతున్నార‌ని అని త‌నని అడిగిన‌ట్లు అందుకు తాను ఆస్ప‌త్రికి తీసుకెళుతున్న‌ట్లు శశికళ చెప్పారు.
జ‌య‌ల‌లిత ఆస్ప‌త్రిలో ఉండ‌గా రాష్ట్ర‌గ‌వ‌ర్న‌ర్ 2016 అక్టోబర్ 22న గవర్నర్ విద్యాసాగర్ రావు జయను పరామర్శించారని ఆమె చెప్పారు. మరో వైపు 2016 సెప్టెంబరు 22-27 మధ్య పన్నీర్‌సెల్వం, తంబిదురై, విజయ భాస్కర్‌‌లు జయలలితను చూశారని శశికళ విచారణ కమిషన్ ముందు చెప్పారు.
ఇదిలా ఉంటే అక్ర‌మాస్తుల కేసులో తీవ్ర ఒత్తిడికి గురై జ‌య‌ల‌లిత అనారోగ్యం పాలైన‌ట్లు శ‌శిక‌ళ గుర్తు చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో జయకు షుగర్ లెవల్స్ బాగా తగ్గిపోయాయని ఆమె గుర్తు చేశారు. సెప్టెంబర్ 19న మరోసారి ఆమెకు జ్వరం వచ్చిందని శశికల విచారణ కమిషన్ ఎదుట చెప్పారు.
జయ వీడియోలు కమిషన్‌కు ఇచ్చా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో నాలుగు వీడియోలు రికార్డు చేసినట్టు శశికళ గుర్తు చేశారు. జయ అనుమతితోనే ఈ వీడియోలను రికార్డు చేసినట్టు శశికళ చెప్పారు. అయితే ఈ వీడియోలను విచారణ కమిషన్ ‌కు శశికళ సమర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories