ధడక్‌ సెట్‌లో జాన్వీ

Submitted by arun on Fri, 03/09/2018 - 11:05
janhvi kapoor

శ్రీదేవి మరణంతో ఢీలా పడ్డ ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు ముందు "నువ్వు గర్వపడేలా చేస్తానని" అంటూ శ్రీదేవికి సోషల్ మీడియా వేదికగా మాటిచ్చిన జాన్వీ.. ఇప్పుడు ఆ మాటను నెరవేర్చుకునే క్రమంలో పడింది. ఇందులో భాగంగా తాజాగా తాను హీరోయిన్‌గా నటిస్తున్న 'ధడక్' షూటింగ్‌లో పాల్గొంది జాన్వీ. గురువారం జాన్వీ దఢక్ షూటింగ్‌లో పాల్గొనగా.. బాంద్రాలో రెండు రోజుల పాటు జాన్వీ, ఇషాన్‌లపై రొమాంటిక్‌ సన్నివేశాల చిత్రీకరణ అనంతరం వచ్చే వారం చిత్ర యూనిట్‌ పోస్ట్‌ ఇంటర్వెల్‌ సీన్స్‌ను తెరకెక్కించేందుకు కోల్‌కతా పయనమవుతుంది. ఇప్పటివరకూ చిత్ర ఫస్ట్‌హాఫ్‌ను రాజస్ధాన్‌, ముంబయిలో షూట్‌ చేశారు. మూవీ షూటింగ్‌కు భారీ విరామం ఇచ్చామనే వార్తల్లో నిజం లేదని..ముంబయిలో తిరిగి షూటింగ్‌ ప్రారంభమైందని తదుపరి షెడ్యూల్‌ కోల్‌కతాలో ప్లాన్‌ చేశామని దర్శకుడు శశాంక్‌ ఖైతాన్‌ చెప్పారు. మరాఠీ చిత్రం సైరత్‌కు రీమేక్‌గా ధడక్‌ రూపొందుతోంది.

English Title
janhvi kapoor returns to the sets dhadak

MORE FROM AUTHOR

RELATED ARTICLES