జనసేన పార్టీ మరో కొత్త సంప్రదాయం

Submitted by arun on Fri, 04/13/2018 - 12:00
janasana

సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ‌్ పార్టీ పద్ధతుల్లో కూడా కొత్త మార్పులు ప్రవేశపెడుతున్నారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించే రాజకీయ ఆచారానికి స్వస్థి చెప్పిన జనసేన కొత్త తరహాలో కార్యకర్తలకు, నేతలకు స్వాగతం పలుకుతోంది. అయితే కొత్తగా అనిపిస్తున్న ఈ పద్ధతి పార్టీ ప్రత్యేకతను చాటుతోందని జనసేనలోకి చేరుతున్నవారు అంటున్నారు. 

జనసేన పార్టీ గుర్తుతో బ్యాడ్జీలు పెట్టించుకుంటున్న వీళ్లను పవన్ కల్యాణ్ సినీ అభిమానులు అనుకుంటున్నారా? కాదు జనసేన పార్టీలోకి కొత్తగా చేరినవాళ్లు..అదేంటి.. పార్టీలోకి కొత్తగా చేరినవాళ్ల మెడలో కండువాలు ఉండాలి కదా.. అవి లేకుండా ఈ బ్యాడ్జీలేమిటి? అని ఆశ్చర్యపోవద్దు. అదే జనసేన ప్రత్యేకత. 

రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ కండువా కప్పి కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించడం ప్రతి పార్టీలోనూ జరుగుతోంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారుతున్నవారికీ ఇదే సంప్రదాయంతో స్వాగతం పలుకుతారు. కానీ కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జనసేన ఇక్కడ తన విభిన్నతను చాటుకుంటోంది. అభిమానులైనా, ప్రజా ప్రతినిధులైనా, వేరే పార్టీ నుంచి వస్తున్నవారినైనా కండువాలు కప్పకుండా షర్ట్‌కు బ్యాడ్జీ  తగిలించి పార్టీలోకి ఆహ్వానిస్తోంది జనసేన. తాజాగా తెలంగాణలోని  ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల నుంచి జనసేనలోకి చేరిన కొంతమందికి బ్యాడ్జీలు పెట్టి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ విధానం బాగుందని కొత్తగా పార్టీలోకి చేరేవారు చెబుతున్నారు. చీటికీ మాటికీ కండువాలు మార్చే నేతలకు చెక్ పెట్టేందుకు జనసేన ఈ విధానాన్ని అనుసరిస్తోందని అభిమానులు అంటున్నారు. చూద్దాం.. మరి జనసేన కొత్త పద్ధతి ఎంతవరకు మార్పు తీసుకొస్తుందో. 

English Title
janasena party go different

MORE FROM AUTHOR

RELATED ARTICLES