జనసమితి రెండో లిస్టు విడుదల

Submitted by chandram on Sun, 11/18/2018 - 17:50
tjs

తెలంగాణ జనసమితి రెండో లిస్టును ప్రకటించింది. ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీజేఎస్‌ తాజాగా మరో మూడు స్థానాలకు అభ్యర్థులకు బీ ఫారాలిచ్చింది. మిర్యాలగూడ నుంచి విద్యాధర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి రాజేందర్‌రెడ్డి, వరంగల్‌ ఈస్ట్‌ నుంచి ఇన్నయ్యను అభ్యర్థులుగా ప్రకటించారు. ఇప్పటికే మెదక్‌, సిద్దిపేట, దుబ్బాక, మల్కాజ్‌గిరి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్త ఏడుగురు అభ్యర్థులకు టీజేఎస్‌ బీ ఫారాలిచ్చింది. మరోవైపు మిర్యాలగూడ స్థానాన్ని ఆశించిన జానారెడ్డి కుమారుడికి సీటు లేనట్టే అని తేలిపోయింది. టీజేఎస్‌ పోటీ చేస్తుండటంతో కూటమి నుంచి జానా కుమారుడికి సీటు లేనట్లే అని తేలిపోయింది. మరోవైపు పొత్తులో భాగంగా మహబూబ్‌నగర్‌ నుంచి టీడీపీ అభ్యర్థి నిలబడగా అక్కడ కూడా రాజేందర్‌రెడ్డికి టీజేఎస్‌ బీ ఫారమ్‌ ఇచ్చింది. 

English Title
janasamithi second list realsed

MORE FROM AUTHOR

RELATED ARTICLES